నిన్నటితో బిగ్ బాస్ సీజన్ 8 షో 3 వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారం బెజవాడ బేబక్క, రెండవ వారం ఆర్జె శేఖర్ బాషా ఎలిమినేట్ కాగా, మూడో వారం 'బిగ్ బాస్'ను ఘోరంగా అవమానించిన ప్రముఖ నటుడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. తాజాగా నాలుగవ వారానికి సంబంధించిన నామినేషన్స్ రచ్చ మొదలయ్యిందని ప్రోమో ద్వారా చూపించారు బిగ్ బాస్ మేకర్స్. మూడు వారాల్లో ఏం జరిగింది అనేది దృష్టిలో పెట్టుకొని హౌస్ లో ఉండడానికి ఎవరు అర్హులు కారు అనే విషయాన్ని ఫోమ్ స్ప్రే చేసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు.
నాలుగవ వారం నామినేషన్స్ థీమ్ ఇదే
ఎప్పటిలాగే బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ లో కూడా ఒక ప్రత్యేకమైన థీమ్ ఇచ్చాడు. నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ ముఖంపై స్ప్రే చేస్తూ రీజన్ చెప్పాలి. ముందుగా ఆదిత్య సోనియాను నామినేట్ చేయడంతో ప్రోమో మొదలైంది. "మొదటి మూడు రోజుల్లో కనిపించిన సోనియా నాకు తర్వాత కనిపించలేదు" అంటూ ఆదిత్య పాయింట్ చెప్పాడు. ఆ తర్వాత నబిల్ కూడా సోనియానే నామినేట్ చేసి "నేను సంచాలక్ గా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడావు. నరాలన్నీ కనిపిస్తున్నాయి. నువ్వు నన్ను బెదిరించావు" అంటూ నబిల్ ఏదో చెప్పబోతే అంతలోనే సోనియా మధ్యలో దూరింది. దీంతో నబిల్ యాటిట్యూడ్ చూపించాడు. ప్రోమో చూస్తుంటే ఇద్దరికీ మధ్య గట్టిగానే గొడవ అయినట్టుగా అనిపిస్తోంది. అలాగే ఆదిత్య ఓం పృథ్వీపై ఫోమ్ స్ప్రే చేసి "మీరు గట్టిగా ఇన్సల్ట్ చేస్తారు. అంత గట్టిగా అరవగలిగినప్పుడు సారీ కూడా అంతే గట్టిగా చెప్పాలి. కానీ నాకు మీరు అలా చెప్పినట్టు వినిపించలేదు" అంటూ తన రీజన్ చెప్పాడు ఆదిత్య. వెంటనే పృథ్వి నేను మిమ్మల్ని "ఎప్పుడూ ఇన్సల్ట్ చేయలేదు. మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను తీసుకోవాలా?" అంటూ గొడవకి దిగాడు.
Read Also : Pawan Kalyan: వీరమల్లు సెట్స్‌లో అడుగుపెట్టిన పవన్... HHVM రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారోచ్
అందరికీ టార్గెట్ సోనియానే...
ఇక ప్రోమో చూస్తుంటే ఈసారి నామినేషన్లలో అందరికీ సోనియానే టార్గెట్ అయినట్టుగా కనిపిస్తోంది. ప్రోమోలో నబిల్ "ప్రతిసారి నా గురించి నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు" అంటూ సోనియాపై విరుచుకుపడ్డాడు. ఆమె సమాధానం చెప్పబోతే అంతలోనే "నా పాయింట్ అయిపోని" అంటూ ఆమె చెప్పేది వినకుండా వెకిలి చేష్టలు చేశాడు. ఇక ఆ తర్వాత నైనిక "నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకొకరి కాన్ఫిడెన్స్ ను డౌన్ చేయకూడదు" అంటూ మణికంఠను నామినేట్ చేసింది. మొత్తానికి ప్రోమోని చూస్తుంటే నాలుగవ వీక్ నామినేషన్స్ కూడా హీట్ పుట్టించేలా ఉన్నాయి అనిపిస్తోంది. అంతేకాకుండా హౌస్ లోకి ప్రస్తుతం ఉన్న సభ్యులు రెండు టీమ్స్ గా విడిపోయినట్టుగా కనిపిస్తోంది. నబిల్, పృథ్వీ మధ్య గొడవ జరిగేటప్పుడు సోనియా మధ్యలో కల్పించుకుని సపోర్ట్ గా మాట్లాడితే, నబిల్ సోనియాకు ఇచ్చి పడేసిన తీరును చూసి యష్మి హ్యాపీగా నవ్వేసింది.