Bigg Boss 8 Telugu Episode 22 Day 21: పస లేని ఎపిసోడ్... సోనియా, విష్ణు ప్రియలపై నాగ్ ఫోకస్ - ఎలిమినేట్ అయ్యాక అభయ్ ఏం చెప్పాడంటే?

Bigg Boss 8 Telugu Episode 22 Day 21: బిగ్ బాస్ సండే ఎపిసోడ్ ఎటువంటి ఎంటర్టైనింగ్‌గా నీరసంగా సాగింది. ఎలిమినేట్ ఎవరు అవుతారనే ఆసక్తి, ఆత్రుత కూడా లేకుండా పోయింది.

Continues below advertisement

Bigg Boss 8 Telugu Episode 22 Day 21 written Review: బిగ్ బాస్ సండే ఎపిసోడ్ సప్పగా సాగింది. ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా నీరసంగా సాగింది. ఏ మాత్రం ఎంటర్టైనింగ్‌గా లేని టాస్కులతో విసిగించారు. ఇక అభయ్ ఎలిమినేట్ అవుతాడని అందరికీ శనివారమే తెలిసింది. దీంతో ఎలిమినేట్ ఎవరు అవుతారనే ఆసక్తి, ఆత్రుత కూడా లేకుండా పోయింది. నాగ్ ఆడించిన ఆటల్లో పస లేదు. వినోదం అంతకంటే లేదు. ఇక అభయ్ వెళ్తూ వెళ్తూ ఏం చెబుతాడు అనే విషయాలపై కాస్త ఇంట్రెస్ట్ ఏర్పడే అవకాశం ఉంది.

Continues below advertisement

ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌లో సందే ఫండే అంటూ ఆటలు ఆడించాడు నాగ్. కట్, సెట్ అంటూ హార్ట్ బ్రేక్, హార్ట్ సెట్ ఆటలు ఆడించాడు. ఓ కంటెస్టెంట్‌ను నిల్చొబెట్టి.. ఇంకో ఇద్దరి కంటెస్టెంట్ల పేర్లు చెప్పి.. అందులో ఎవరికి హార్ట్ ఇస్తావ్.. ఎవరి హార్ట్ బ్రేక్ చేస్తావ్ అని చెప్పాలంటూ నాగ్ టాస్క్ పెట్టాడు. ఆ టాస్కులో ఎవరూ సరైన కారణాలు చెప్పలేదు. ఆ టాస్క్ కూడా రసవత్తరంగా అనిపించలేదు.

పజిల్ ఇచ్చి.. వాటిని సెట్ చేసి.. పాటను గుర్తు పట్టాలనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో  విష్ణు ప్రియ, నిఖిల్, నయని, ప్రేరణ, యష్మీల డ్యాన్స్ కాస్త పర్వాలేదనిపించింది. విష్ణు ప్రియ ఎక్కువగా డ్యాన్స్ చేయలేదు.  నిఖిల్ మాత్రం చాలా సార్లు స్టెప్పులు వేసేందుకు వచ్చాడు. ఇక కళ్లకు గంతలు కట్టించి మరో టాస్క్ ఆడించాడు. అది కూడా అంత ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. ఇక చివరకు పృథ్వీ, అభయ్ మిగిలితే.. అభయ్ బయటకు వచ్చాడు. అభయ్ ఎలిమినేషన్‌తో సీత కన్నీరుమున్నీరు అయింది.

Also Read: హగ్గులు కాదు ఆటలు ఆడు... మణికంఠకు విష్ణు స్వీట్ వార్నింగ్, ప్రేరణ దోశ పంచాయితీ తేల్చిన నాగ్

బయటకు వచ్చిన అభయ్‌కి నాగ్ బ్లాక్ రోజ్, రెడ్ రోజ్ అంటూ టాస్క్ పెట్టాడు. విష్ణు ప్రియ మాటల్ని అదుపులో పెట్టుకోవాలని, మణికంఠకి కూడా విలువైన సలహాలు ఇస్తూ బ్లాక్ రోజ్ ఇచ్చాడు. పృథ్వీ చివరి వరకు ఉండాలి... కోపాన్ని తగ్గించుకోవాలని బ్లాక్ రోజ్ ఇచ్చాడు. 'నిఖిల్‌ను ముందు చూసినప్పుడు వేరేలా అనుకున్నా.. కానీ తరువాత అతని గురించి అర్థమైంది' అని రెడ్ రోజ్ ఇచ్చాడు. 'వచ్చే ఏడాది రాఖీ కట్టించుకునేందుకు వెయిట్ చేస్తాను' అని సీత గురించి అభయ్ అన్నాడు. 'సోనియా కేరింగ్‌గా ఉంటుంది. నబిల్‌ బాగా ఆట ఆడు, ట్రోఫీ గెలువు' అని అభయ్ అన్నాడు.

Also Read: బిగ్​బాస్​కి మూడో కంటెస్టెంట్​గా వెళ్లాడు.. మూడో వారంలోనే వచ్చేశాడు.. అభయ్ నవీన్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?

నాగార్జున పదే పదే సోనియాను, విష్ణు ప్రియను లేపే ప్రయత్నం చేశాడు. సోనియాతో పాట పాడించాడు. ఆ పాట వినడానికి ప్రేక్షకుడు కష్టపడాల్సి వచ్చేలా ఉంది. విష్ణు ప్రియ చేసే చేష్టలు క్యూట్‌గా ఉన్నాయని భ్రమ పడుతోన్నట్టుగా ఉంది. కానీ అదే కొన్ని సార్లు క్రింజ్‌లా అనిపిస్తోందని విష్ణు తెలుసుకోలేకపోతోంది. ఇక నాలుగో వారంలో ఎవరు నామినేట్ అవుతారు.. బిగ్ బాస్ ఎలాంటి ఆటలు ఆడిస్తారు అన్నది చూడాలి.

Also Readఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా

Continues below advertisement