Bigg Boss 8 Telugu Episode 21 Day 20: బిగ్ బాస్ ఇంట్లో శనివారం నాగార్జున గరం అయ్యాడు. కంటెస్టెంట్లను డీప్ ఫ్రై చేసి పాడేశాడు. ఇక అభయ్‌ను అయితే తిట్టిన తిట్టు తిట్టకుండా రోస్ట్ చేశాడు. ఆ తరువాత ప్రేరణ, విష్ణు ప్రియల పంచాయితీని తేల్చాడు. ఆపై మణికంఠకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. పృథ్వీకి మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా ఈ మూడో వారంలో కంటెస్టెంట్లు చేసిన వాటిని గుర్తు చేసి, తప్పులు చూపించి దారిలో పెట్టే ప్రయత్నం చేశాడు నాగార్జున.
బిగ్ బాస్‌ను తిట్టిన తిట్లన్నీ వీడియో వేయించి అందరికీ చూపించాడు. అభయ్ తిట్టిన తిట్లతోనే నాగార్జున అభయ్‌ని తిట్టాడు. ''ఇది బిగ్ బాస్ ఇళ్లు.. బిగ్ బాస్ రూల్స్ నడుస్తాయి.. ఎలా ఆడిస్తే అలా ఆడాలి.. నచ్చకపోతే వెళ్లిపో'' అంటూ రెడ్ కార్డ్ ఇచ్చేశాడు నాగ్. అభయ్ తన తప్పులకు మోకాళ్ల మీద కూర్చుని బిగ్ బాస్‌కు, నాగార్జునకు సారీ చెప్పాడు. ''నేనే బిగ్ బాస్‌ను గౌరవిస్తా... ఇది బిగ్ బాస్ ఇల్లు... ఇక్కడ బిగ్ బాస్ కంటే ఎవ్వరూ గొప్పకారు... నిన్ను కట్ చేయకపోతే.. నీ యాటిట్యూడే అందరికీ వస్తుంది.. నేను నిర్ణయం తీసుకున్నా.. నువ్వు బయటకు వెళ్లు'' అని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటి సభ్యులంతా కలిసి క్షమించమని కోరారు. నిఖిల్, సోనియా క్షమాపణలు అడిగారు. సోనియా అడిగితే కూల్ అయిన నాగ్... ఇంటి సభ్యుల నుంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇంటి సభ్యులంతా అభయ్‌కి సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అడగడంతో.. నాగ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
ఇక ఇదే పంచాయితీలో బెలూన్ టాస్కులో సోనియా సంచాలక్‌గా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అన్నట్టుగా నాగార్జున తీర్పు ఇచ్చాడు. కానీ సోనియా తన టీంకు ఫేవర్‌గా ఆడిందని అందరికీ తెలిసిందే. కానీ అభయ్‌దే పూర్తి తప్పు అన్నట్టుగా నాగార్జున ప్రొజెక్ట్ చేశాడు. సోనియా మళ్లీ బిగ్ బాస్ దత్త పుత్రిక అని నిరూపించాడు. సోనియా తప్పులు చేసినా కూడా ఆమెను నాగ్ ఏ మాత్రం మందలించలేదు. సోనియా తప్పులేవీ కూడా బిగ్ బాస్ టీంకు కనిపించడం లేదనిపిస్తుంది. యష్మీ లేచి మధ్యలో సోనియా చేసిన తప్పుని చెప్పబోతో.. మూస్కుని కూర్చో అన్నట్టుగా నాగార్జున కౌంటర్ వేశాడు. అభయ్ ఎపిసోడ్ ముగిసన తరువాత మిగిలిన కంటెస్టెంట్లకు తలంటు పోశారు.
Also Read: బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!
ఆ తరువాత ఇంట్లోని లేడీ కంటెస్టెంట్లను నిల్చొమన్నాడు. ఎగ్ టాస్కులో అందరూ అద్బుతంగా ఆడారని.. ఒక్కొక్కొరు ఆడిన తీరుకు లక్ష చొప్పున ఆరులక్షల ప్రైజ్ మనీ వచ్చిందని, అలా మొత్తంగా పదకొండు లక్షల అరవై వేలు అయిందని చెప్పుకొచ్చాడు. అనంతరం ప్రేరణకు క్లాస్ పీకాడు. సీతను కాలితో తన్నడం, విష్ణు ప్రియని రాక్షసి కారెక్టర్ లెస్ అని అనడం మీద వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి రిపీట్ కావొద్దని, మాటలు జారితే తిరిగి తెచ్చుకోలేమని అన్నాడు. దోశ ఎపిసోడ్ మీద కూడా క్లారిటీ ఇచ్చాడు. వీడియో వేసి చూపించాడు. మణికంఠ వల్లే గొడవ పెద్దదైందని నాగ్ అన్నాడు. ప్రేరణ కావాలని అలా చేయలేదని, కావాలని సాగదీశావ్, కావాలనే సీన్ చేశావ్ అని విష్ణుకి చీవాట్లు పెట్టాడు.
తప్పు ఒప్పుకోలేక నాగ్‌తో వాదించాడు మణికంఠ. చివరకు మళ్లీ వీడియో చూపించాడు. అందులో ప్రేరణ ఎలా దోశ వేసింది అని క్లారిటీగా ఇంటి సభ్యుల్ని అడిగారు. చివరకు మణికంఠకు నాగార్జున క్లాస్ పీకాడు. మణికంఠ.. నీ ఆట నువ్వు ఆడుకో.. మధ్యలో వెళ్తే నలిగిపోతావ్.. అని కౌంటర్ వేశాడు. చివరకు ప్రేరణ, విష్ణుల మద్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు మీ ఇద్దరూ ఇలా చేస్తే.. మీరే ప్రేక్షకుల దృష్టిలో పడిపోతారు.. అని నాగ్ కాస్త హింట్ ఇచ్చాడు. ఆ తరువాత ఒకరికొకరు ఎగ్స్ తినిపించుకోవాలని నాగ్ అన్నాడు.
పృథ్వీకి చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. ఆట బాగానే ఉంది కానీ మాటలు అదుపులో పెట్టుకో అని అన్నాడు. ఆ తరవాత మణికంఠని కన్‌ఫెషన్ రూంలోకి నాగ్ పిలిపించుకున్నాడు. యష్మీని పదే పదే హక్కులు చేసుకోవడం.. యష్మీ అన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అయి అందరితో చెప్పి ఏడ్చే సీన్లను చూపించాడు. దీంతో మణికంఠ ఫీల్ అయ్యాడు. ఇక్కడకు ఎందుకు వచ్చావో అది మాత్రమే గుర్తు పెట్టుకో.. అవతలి వాళ్ల హద్దులు, బార్డర్లను తెలుసుకుని ప్రవర్తించి.. హద్దుల్లో ఉండు అంటూ నాగ్ వార్నింగ్ ఇచ్చాడు.
Also Read: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా