Bigg Boss 8 Telugu Day 20 Promo: లఫంగి మాటలు, నీ ఫేస్ నీ వాయిస్... అభయ్‌ని బయటకు గెంటేసిన నాగ్ - షేక్ చేసిన రెడ్ కార్డ్ 

బిగ్ బాస్ తెలుగు 8 డే 20కి సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో నాగార్జున అభయ్ నవీన్ పై సీరియస్ అవుతూ ఆయనను రెడ్ కార్డు ద్వారా బయటకు పంపారు.

Continues below advertisement

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం జరిగిన రచ్చ అంతా కాదు. హౌస్ లో బూతులు మాట్లాడడమే కాకుండా కొట్టుకోవడం, తిట్టుకోవడం, తన్నుకోవడం లేడీ కంటెస్టెంట్స్ తో సహా ప్రతి ఒక్కరు హద్దులు దాటారు. ఇక అభయ్ అయితే తన నోటి దురుసుతనంతో ఏకంగా బిగ్ బాస్ పై దారుణంగా సెటైర్లు పేల్చాడు.  దీంతో ఈ వారం నాగార్జున ఎవరికి ఎలా గడ్డి పెడతారా? అనే ఆసక్తి మొదలైంది ప్రేక్షకులకు. చూస్తుండగానే మూడో వారం ఎండింగ్ కి వచ్చేసింది బిగ్ బాస్. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున సీరియస్ గా కనిపించారు. రెడ్ కార్డు చూపించి ఏకంగా అభయ్ ని బయటకు గెంటేశారు. 

Continues below advertisement

లఫంగి మాటలు... అభయ్ కు ఝలక్ 
ప్రోమో మొదట్లోనే నాగర్జున సీరియస్ గా స్టిక్ పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అభయ్ బిగ్ బాస్ ను అన్న మాటలు చూపించారు. వారం మొత్తంలో "ఆయనకే తెలియదు ఏమవుతుందో. ఆయన వాళ్ళ పెళ్ళాం కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్టుగా ఉన్నాడు. నా వాయిస్ వేసి వాళ్ళ ముఖాలు వేసి ఇలాంటి లఫంగి ఎడిట్స్ చేయకండి మీరు.. నా వాయిస్, నా ముఖమే వేయండి. బిగ్ బాస్ కాదు నువ్వు.. బయాస్డ్ బాస్. బయట ఇంటర్వ్యూకి వెళ్లినా ఇదే మాట చెప్తాను లిమిట్ లెస్ బయాస్డ్ బిగ్ బాస్" అంటూ అభయ్ అన్న మాటలన్నీ ముందుగా ప్రోమోలో చూపించారు. ఆ తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ అందరిని కూర్చోబెట్టారు. ఇక అభయ్ ని లేపి "నీ ఫేస్, నీ వాయిసే అన్నీ లఫంగి మాటలు... ఒకటి కాదు రెండు కాదు అభయ్ ఇది బిగ్ బాస్ హౌస్.. ఓన్లీ బిగ్ బాస్ విల్ రూల్" అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వెంటనే ఆ అభయ్ మోకాళ్లపై కూర్చుని సారీ చెప్పాడు. 

Read Also : Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఇంటిలో ఆ హగ్గులు, ముద్దులు ఏంట్రా బాబూ... ఫ్యామిలీ షో అని మర్చిపోయారా?

హౌస్ ని షేక్ చేసిన రెడ్ కార్డ్ 
"ఇదొక్కటి తప్ప నేనేం తప్పు చేయలేదు. సారీ సర్" అంటూ అభయ్ మోకాళ్లపై కూర్చుని సారీ చెప్పినప్పటికీ నాగార్జున కరగలేదు. నాగ్ మాట్లాడుతూ "బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోతే నేను ఒప్పుకోను. నేను నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నాను. బిగ్ బాస్ ఓపెన్ ది డోర్... అభయ్ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్" అని నాగార్జున సీరియస్ గా చెప్పడంతో బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేశారు. ఆ తర్వాత యష్మి గౌడ, అభయ్ నవీన్ కలిసి ఒక్క ఛాన్స్ అంటూ నాగార్జునను వేడుకున్నారు. వెంటనే నాగార్జున "మై డిసిషన్ ఈజ్ ఫైనల్... గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్" అనగానే ప్రోమో ఎండ్ అయ్యింది. ఇక ప్రోమోను చూస్తుంటే నాగర్జున అభయ్ ని నిజంగానే బయటకు గెంటేసినట్టుగా కనిపిస్తోంది. మరి ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజు రాత్రి స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్ ను చూడాల్సిందే.

Read also ; Bigg Boss 8 Telugu: పెద్ద బాంబ్ పేల్చిన బిగ్ బాస్ - అభయ్ క్లాన్ మొత్తానికి కష్టాలు... చీఫ్ పదవిని పీకేసి స్ట్రాంగ్ వార్నింగ్

Continues below advertisement