Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో చివరి నామినేషన్స్‌కు సమయం వచ్చేసింది. ఈవారం ఎలిమినేషన్ ముగిసిన తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ అంతా ఫినాలే వీక్‌కు చేరుకుంటారు. అందుకే ఈ నామినేషన్స్.. తర్వాత జరిగే ఎలిమినేషన్ కూడా చాలా కీలకంగా మారనుంది. ఇక ప్రతీ నామినేషన్‌లాగానే ఈవారం కూడా కంటెస్టెంట్స్ మధ్య పలు వాగ్వాదాలు జరగనున్నాయి. నామినేషన్స్ ఎపిసోడ్‌కు సంబంధించిన మొదటి ప్రోమో తాజాగా విడుదలవ్వగా.. అందులో శోభా శెట్టి నామినేషన్స్‌నే హైలెట్‌గా చూపించారు. దీన్ని బట్టి చూస్తే శివాజీ, యావర్‌లతో శోభా.. పెద్ద గొడవే చేసినట్టు తెలుస్తోంది.


ప్రియాంక, శోభాలను నామినేట్ చేసిన యావర్..
ముందుగా చివరి నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేయాలంటే కంటెస్టెంట్స్.. ఒక్కొక్కరుగా వచ్చి టైల్‌పై తాము నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెంట్ ఫోటోను ప్రింట్ చేసి.. ఆ తర్వాత దానిని పగలగొట్టాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ వివరించారు. అందరికంటే ముందుగా వచ్చిన యావర్.. శోభాను నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ‘‘నువ్వు గుడ్డిగా వేరేవాళ్ల మాట ఫాలో అవుతావు’’ అని కారణం చెప్పాడు. అయితే మర్డర్ టాస్క్‌లో జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ‘‘శెట్టి గెట్ లాస్ట్ అని రాయడం నాకు నచ్చలేదు’’ అంటూ శోభా రివర్స్ అయ్యింది. ‘‘గెట్ లాస్ట్ అని నేను రాయలేదు’’ అంటూ యావర్ కూడా రివర్స్ అయ్యాడు.


శోభాతో పాటు ప్రియాంకను కూడా నామినేట్ చేస్తున్నట్టు తెలిపాడు యావర్. తనకు బ్రెయిన్ ఉపయోగించడం లేదు అని ప్రియాంక అన్నందుకు అమర్‌దీప్ ఏమైనా బ్రెయిన్ ఉపయోగిస్తున్నాడా అని ప్రశ్నించాడు. అంతే కాకుండా కిచెన్‌లో తక్కువ యాక్టివ్ ఉంటున్నాడు అని ప్రియాంక ఆరోపించిన విషయాన్ని కూడా గుర్తుచేశాడు. ‘‘పని తక్కువ చేయడం అనడం వేరు’’ అని ప్రియాంక క్లారిటీ ఇవ్వబోతుండగా.. ‘‘శోభా కూడా తక్కువే చేస్తుంది’’ అని యావర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో శోభా సీరియస్ అయ్యింది. ‘‘నాతో పోల్చుకోకు. డిన్నర్ రెడీ అయిన తర్వాత వస్తావు. తింటావు. వెళ్లి కూర్చుంటావు. ఏం చేస్తున్నావు’’ అని ప్రశ్నించింది.


శివాజీ, యావర్‌లను నామినేట్ చేసిన శోభా..
ఆ తర్వాత వచ్చిన శోభా.. యావర్‌ను నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది. తను చెప్తున్న కారణాన్ని వినకుండా యావర్.. అటు ఇటు తిరుగుతుండడంతో.. ‘‘విను తర్వాత యాక్టింగ్ చేయి. నీకంటే ఎక్కువ యాక్షన్ చేయగలను నేను’’ అని గట్టిగా మాట్లాడింది శోభా. యావర్‌తో పాటు శివాజీని కూడా నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. ‘‘ఎక్కడో ఒక చోట ఆట వదిలేసుకున్నావేమో అనిపించింది’’ అని ఫినాలే అస్త్రా టాస్కులో శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడింది.


‘‘అలా ఎందుకు చేస్తాను. తెలిసి ఎందుకు చేస్తాను. రేసులో ఉండాలనే అనుకుంటాను. అమర్ ఫౌల్ గేమ్ ఆడాడని అందరికీ చూపించాం.. అది నీకు తప్పు అనిపించలేదా? దాని మీద నామినేషన్ వేయాలని అనిపించలేదా?’’ అని రివర్స్ అయ్యాడు శివాజీ. ‘‘దాని గురించి నేను నామినేషన్ చేయాలని అనుకోలేదు’’ అంటూ శోభా సూటిగా చెప్పేసింది. ‘‘నువ్వేమైనా ఒలింపిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి నన్ను డామినేట్ చేసుంటే కచ్చితంగా నేను నీ నామినేషన్‌ను యాక్సెప్ట్ చేసేవాడిని’’ అని శోభా నామినేషన్‌ను అంగీకరించలేదు శివాజీ.



Also Read: బయటికి వెళ్లిన తర్వాత ముందుగా శుభశ్రీతో మాట్లాడతా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన గౌతమ్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply