Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 నుండి డాక్టర్ బాబు అలియాస్ గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. చాలామంది ప్రేక్షకులు.. తను టాప్ 5లో ఉంటాడని అనుకున్నారు కానీ ఫైనల్స్‌కు ఇంకా రెండు వారాలు ఉండగానే ఎలిమినేట్ అవ్వడంతో తనకు ఓట్లు వేసిన ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. కానీ గౌతమ్ మాత్రం ఇన్నిరోజులు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండి తృప్తితో, జ్ఞాపకాలతో వెళ్లిపోతున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇక బయటికి వచ్చి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్.. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
శుభశ్రీ నచ్చింది..
బిగ్ బాస్ బజ్‌లోకి ఎంటర్ అయిన వెంటనే అసలు అశ్వద్ధామ అంటే ఏంటి? ఎవరికి అర్థం కాలేదు అని ప్రశ్నించింది గీతూ. ‘‘ఒకసారి నేను బయటికి వెళ్లినా కూడా తిరిగొచ్చాను కదా అందుకే చావు లేదని చెప్పేసి నాకు నేనే పెట్టుకున్నాను’’ అని చాలామంది ప్రేక్షకుల డౌట్ తీర్చాడు గౌతమ్. ‘‘మాకు 1.0లో, 2.0లో కనిపించిన తేడా ఏంటంటే.. 1.0లో శుభశ్రీ మీకు చాలా నచ్చింది’’ అని మొహమాటం లేకుండా చెప్పేసింది గీతూ. ‘‘ముందుగా తనతో అయితే మాట్లాడతా బయటికి వెళ్లిన తర్వాత’’ అని బయటపెట్టాడు గౌతమ్. ‘‘మరి శుభశ్రీ మీకు అంత క్లోజ్ అయినప్పుడు లెటర్ త్యాగం చేసే టాస్కులో అంత ఎమోషనల్ అత్యాచార్ ఎందుకు చేశారు’’ అని అడిగింది గీతూ. అంతే కాకుండా ‘‘అశ్వద్ధామ 2.0 అయిన తర్వాత శివాజీని ఎక్కువగా టార్గెట్ చేయడం, గతవారం నామినేషన్స్‌లో పంచె ఊడిపోడికుండా చూసుకో అని ఒక మాట అన్నాడు ప్రశాంత్’’ అంటూ పాత విషయాలను గుర్తుచేస్తూ గౌతమ్ దగ్గర క్లారిటీ తీసుకుంది. ఎక్కువగా శివాజీ గురించే గౌతమ్‌కు ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘‘శివాజీ గేమ్ గురించి ఆడియన్స్‌కు, నాగార్జునకు ఏదో చెప్దాం అనుకున్నారు. కరెక్ట్‌గా చెప్పగలిగారా’’ అని కూడా ప్రశ్నించింది గీతూ. ఆ తర్వాత గౌతమ్ ఇచ్చిన సమాధానం విన్న గీతూ.. ‘‘శివాజీ గేమ్ గురించి హౌజ్‌లో చెప్పలేనిది, నాగార్జున ముందు చెప్పలేనిది గౌతమ్ మన బజ్‌లో చెప్పాడు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది.
ఆయన స్ట్రాటజీనే ఆయనను గెలిపిస్తుంది..
ఆ తర్వాత ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న టాప్ 7 కంటెస్టెంట్స్‌లో టైటిల్ రేసులో ముందుకు వెళ్లేది ఎవరు? ముగిసిపోయేది ఎవరు? చెప్పమని గౌతమ్‌కు గీతూ టాస్క్ ఇచ్చింది. అయితే అదే విషయాన్ని చెప్తూ ఒక్కొక్కరి గురించి సెపరేటుగా మాట్లాడాడు గౌతమ్. ముందుగా ప్రియాంక గురించి చెప్తూ.. ‘‘ఒక్కసారి నాకు మనసులో బాండింగ్ అనేది వచ్చిందంటే ఎప్పటికీ ఉంటుంది’’ అని తనతో ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పాడు. ‘‘అదంతా తన గేమ్ అయ్యిండొచ్చు, తన స్ట్రాటజీ అయ్యిండొచ్చు. అదే ఆయనను గెలిపించే ఛాన్స్ కూడా ఉంది’’ అంటూ శివాజీ ఆటపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ప్రశాంత్ గురించి చెప్తూ.. ‘‘ఒక్కటే మైనస్ ఏంటంటే.. శివాజీ అన్న ఏం చేస్తే అదే గుడ్డిగా ఫాలో అయిపోతుంటాడు’’ అని అన్నాడు. ఆ తర్వాత ‘‘అందరి నుండి ఏదో ఒక ఆశిస్తూనే ఉంటాడు’’ అని అమర్ గురించి తెలిపాడు.
Also Read: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply