తెలుగు బుల్లితెర వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్' ఆరో సీజన్ (Bigg Boss Season 6 Telugu) ఈ రోజు మొదలైంది. ఇప్పటి వరకు హౌస్‌లోకి తొమ్మది మంది కంటెస్టెంట్లుఅడుగు పెట్టారు. తొమ్మిది మందిలో ముగ్గురు అబ్బాయిలు అయితే... ఐదుగురు అమ్మాయిలు. ఫిమేల్ డామినేషన్ ఎక్కువ ఉంది కదూ! ఆ సంగతి పక్కన పెడితే... ఫర్ ద ఫస్ట్ టైమ్, తెలుగు 'బిగ్ బాస్' ఇంటిలోకి ఒక జంటను పంపించారు.
రియల్ లైఫ్ కపుల్ మరీనా (Bigg Boss Telugu Season 6 Contestant Marina), రోహిత్ (Bigg Boss Telugu Season 6 Contestant Rohit) 'బిగ్ బాస్'కి వచ్చారు. ఒకరు పదో కంటెస్టెంట్ అయితే... ఇంకొకరు పదకొండో కంటెస్టెంట్. ఇద్దరిలో ఒకరిది గోవా అయితే... మరొకరిది పంజాబ్. హైదరాబాద్ లో పెరిగారు. ఇక్కడ ప్రేమలో పడి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.
సినిమా విడుదల కాలేదు కానీ... రోహిత్, మరీనా తమ ప్రేమకథను స్టేజి మీద నాగార్జునతో పంచుకున్నారు. ఒక సినిమా సెట్ లో తామిద్దరం కలుసుకున్నామని తెలిపారు. ముందు వేరే హీరో హీరోయిన్లతో సినిమా స్టార్ట్ అయ్యిందని, కొన్ని రోజుల తర్వాత ఆ హీరోని తీసేసి రోహిత్ ని హీరోగా తీసుకున్నారని... ఆ తర్వాత కొన్ని రోజులకు హీరోయిన్ ను పక్కకు తప్పించి తనకు అవకాశం ఇచ్చారని మరీనా తెలిపారు. ఆ సినిమా విడుదల కాలేదు కానీ తమ మధ్య బంధం కుదిరిందని రోహిత్ చెప్పుకోచ్చారు.
తానొక ఇంట్రోవర్ట్ అని, తనలో మార్పు కోసం 'బిగ్ బాస్' ఇంటిలో అడుగు పెడుతున్నాని రోహిత్ తెలిపారు. లోపల ఇంట్రోవర్ట్‌గా ఉంటే కుదరదని నాగార్జున అతనితో చెప్పారు. తనకు ఛాలెంజెస్ అంటే ఇష్టమని మరీనా చెప్పారు.
ముందు ఎవరు ప్రపోజ్ చేశారు?
ఇద్దరిలో ఎవరు ఎవరికి ముందుగా ప్రపోజ్ చేశారని నాగార్జున అడిగితే... తానే అని మరీనా చెప్పారు. తామిద్దరికీ గొడవ జరిగితే ముందు తానే సారీ చెబుతానని ఆమె అన్నారు. మోస్ట్ ఆర్గనైజ్డ్ పర్సన్ రోహిత్ అన్నారు. ఇద్దరి మధ్య ఎంత వేవ్ లెంగ్త్ ఉందో తెలుసుకోవడానికి నాగార్జున టెస్ట్ పెట్టారు. ఆల్మోస్ అన్ని సమాధానాలు కరెక్ట్ చెప్పారు ఇద్దరూ. ఒక్క ప్రశ్నకు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు.
మరీనా బెటర్ కిస్సర్!
'మీలో ఎవరు బెటర్ కిస్సర్ ఎవరు?' అని అడిగితే... 'నేను' అని మరీనా చెప్పారు. రోహిత్ కూడా ఆ మాట అంగీకరించారు.
Also Read : 'బిగ్ బాస్' ఇంట్లో చిత్తూరు చిరుత గీతూ - రోడ్డు యాక్సిడెంట్‌లో కుట్లు & కోమా - పెద్ద కథే ఉందిగా
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 6ను ఈ రోజు మొదలు పెట్టారు.
ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోకి హోస్ట్ గా చేసిన అనుభవం ఉన్న నాగార్జున (Akkineni Nagarjuna) ఐదోసారి కూడా హోస్ట్ చేస్తున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
Also Read : ఎంబీబీఎస్ పక్కన పెట్టి మరీ వచ్చిన శ్రీ సత్య - 'రేసుగుర్రం'లో పాటతో ఎంట్రీ