తెలుగు బుల్లితెర వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్' ఆరో సీజన్ (Bigg Boss Season 6 Telugu) ఈ రోజు మొదలైంది. ఇప్పటి వరకు హౌస్‌లోకి ఏడుగురు కంటెస్టెంట్లు వెళ్లారు. అందులో ముగ్గురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఎనిమిదో కంటెస్టెంట్ కూడా అమ్మాయే.
'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన గీతూ రాయల్ (Geetu Royal) అడుగు పెట్టారు. తొలుత 'బిగ్ బాస్' గురించి సోషల్ మీడియాలో ఆమె రివ్యూలు చేసేవారు. ఆ తర్వాత 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోస్ చేశారు. ఇప్పుడు 'బిగ్ బాస్'కి రావడం విశేషం.
'జలజల దూకే జలపాతం మాదిరిగా... గలగల దూకే శైలి మనదిరా స్వామి' అని తన గురించి గీతూ రాయల్ చెప్పుకొచ్చారు. ఆమెది చిత్తూరు. తాను 2014లో రన్నింగ్ బస్సు నుంచి కిందకు పడ్డానని, అప్పుడు జీవితంలో తనకు పెద్ద బ్రేక్ వచ్చిందని, పన్నెండు కుట్లు పడితే కోమాలోకి వెళ్లానని గీతూ రాయల్ తెలిపారు. మళ్ళీ బయటకు గజినీ మాదిరిగా బయటకు వచ్చానని చెప్పారు. అప్పుడు లాభం లేదని ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లోకి వచ్చినట్లు తెలిపారు.
''ఒక పక్క ఆర్జేగా చేస్తూ... మరోపక్క సినిమాలు, షోలు, యూట్యూబ్ ఛానల్, 'బిగ్ బాస్' రివ్యూలు... అభిమానులు... జీవితం మారింది'' అని గీతూ రాయల్ అన్నారు. ఆ తర్వాత తన జీవితంలోకి వికాస్ రావడంతో జీవితం పూర్తిగా వికసించిందని ఆమె చెప్పుకొచ్చారు. జీవితంలో తనది ఒక్కటే రూల్ అని, తనకు ఎవరు ఏమి ఇస్తారో? అది తిరిగి ఇస్తానని గీతూ రాయల్ 'బిగ్ బాస్' ఇంట్లో అడుగుపెట్టే ముందు చెప్పారు.
అందరూ తనది ప్రేమ వివాహం అనుకుంటారని, తనకు 20 ఏళ్ళ నుంచి వికాస్ తెలిసినప్పటికీ... ఇంట్లో పెద్దలు కుదిర్చిన వివాహమే అని గీతూ రాయల్ తెలిపారు. వికాస్ అక్క పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఆలోచించి చెబుతానని ఆమె అన్నారు. తనది టిపికల్ క్యారెక్టర్ కనుక... తెలిసిన వాడు అయితే బాగా చూసుకుంటాడని తన తండ్రి పెళ్లి చేశారని చెప్పుకొచ్చారు. తనకు భయంకరమైన ఇన్ సెక్యూరిటీ అని, దాన్ని అధిగమించడానికి బిగ్ బాస్ ఇంటిలోకి వచ్చాయని గీతూ తెలిపారు.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 6ను ఈ రోజు మొదలు పెట్టారు.
ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోకి హోస్ట్ గా చేసిన అనుభవం ఉన్న నాగార్జున (Akkineni Nagarjuna) ఐదోసారి కూడా హోస్ట్ చేస్తున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
Also Read : ఎంబీబీఎస్ పక్కన పెట్టి మరీ వచ్చిన శ్రీ సత్య - 'రేసుగుర్రం'లో పాటతో ఎంట్రీ
ఇక ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.