బిగ్ బాస్ సీజన్ 5 నాల్గో వారంలో కెప్టెన్ గా శ్రీరామచంద్ర ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు ఎపిసోడ్ లో మొత్తం వారంలో ఎవరైతే వరస్ట్ గా పెర్ఫార్మ్ చేశారో వాళ్లను ఎన్నుకొని జైల్లో పెట్టబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో శ్వేతా.. కాజల్ పై ఫైర్ అవుతూ కనిపించింది. ఇక ఎప్పటిలానే యాంకర్ రవిని టార్గెట్ చేస్తూ నటరాజ్ మాస్టర్ కొన్ని మాటలు అనేశారు. దీంతో రవికి ఆయనపై విపరీతమైన కోపం వస్తుంది. 


Also Read: 'రిపబ్లిక్' మూవీ క్లైమాక్స్.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్..


ఇదిలా ఉండగా.. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో 'ఫేస్ టు ఫేస్' అనే కాన్సెప్ట్ ఏదో ఇచ్చినట్లుగా ఉన్నారు. ఒక్కో కంటెస్టెంట్ ను మిగిలినవాళ్లు ప్రశ్నిస్తూ కనిపించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుండాలి. అయితే శ్రీరామచంద్రని మాత్రం హౌస్ మేట్స్ బాగా ఆదుకున్నారు. ముందుగా.. 'నీ గుండెలో ఎవరైనా అమ్మాయ్ ఉందా..?' అని శ్రీరామ్ ని ప్రశ్నించింది ప్రియా. దానికి శ్రీరామ్ 'నేను సిరికి కూడా చెప్పాను.. ఆమె కమిటెడ్ కాకపోయి ఉంటే కచ్చితంగా ట్రై చేసేవాడ్ని' అని అనగా.. సిరి తెగ సిగ్గుపడిపోయింది. వెంటనే రవి.. 'అన్నా.. నీ టేస్ట్ ఇంత బ్యాడా' అని కామెంట్ వేయగా.. అందరూ నవ్వేశారు. 


ఆ తరువాత శ్వేతా.. 'ఎవరైనా ఒక అమ్మాయిని డేట్ కి తీసుకువెళ్లాలనుకుంటే ఎవరిని తీసుకెళ్తావ్' అని అడిగింది. దానికి శ్రీరామ్.. హమీద వంక చూశాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి 'యువర్ మై ఎవ్రిథింగ్' అనే సాంగ్ కి డాన్స్ చేశారు. సిరి-హమీదలలో ఒకరిని సెలెక్ట్ చేయమని అడగ్గా.. లంచ్ టీమ్ లో సిరి, డిన్నర్ టీమ్ లో హమీద అని చెప్పాడు శ్రీరామ్. 'లంచ్, డిన్నర్ ఓకే మరి టిఫిన్స్ ఎవరు సర్' అని సన్నీ ఫన్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత సన్నీ హౌస్ మేట్స్ ని ఇమిటేట్ చేసి నవ్వించాడు. 






Also Read: రిపబ్లిక్ సమీక్ష: ఆలోచింపజేసే అరుదైన సినిమా.. అయితే?


Also Read: రిపబ్లిక్ సమీక్ష: ఆలోచింపజేసే అరుదైన సినిమా.. అయితే?


Also Read:ఆ రోజు నాకు వైద్యం చేసింది అల్లు రామలింగయ్యే.. రాజమండ్రిలో చిరు చిట్‌చాట్


Also Read: ‘మా’ వారసుడు మంచు విష్ణు.. తెలుగోళ్లే పోటీ చేయాలి.. ఎవడు పడితే వాడు ఆ సీట్లో కూర్చుంటే..: నరేష్ వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి