బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం పూర్తిచేసుకోబోతుంది. ఇప్పటికే తొలివారం సరయు, రెండోవారంలో ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడోవారంలో లహరి ఎలిమినేట్ అయింది. ఇక నాల్గో వారం ఎలిమినేషన్ కోసం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబో, ప్రియా, యాంకర్ రవి, సిరి ఇలా మొత్తం ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. అయితే ఈ ఎనిమిది మందిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంలో అప్పుడే క్లారిటీ వచ్చేసింది. 

Continues below advertisement


Also Read:సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !


అందుతున్న సమాచారంప్రకారం .. ఈ వారం నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి బయటకు వెళ్లబోతన్నారు. ఓటింగ్స్ పరంగా మిగిలిన వాళ్లతో పోలిస్తే నటరాజ్ మాస్టర్ కి తక్కువ ఓట్లు పడినట్లు సమాచారం. అతడికి సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడం కూడా ఎలిమినేషన్ కి కారణమైంది. నిజానికి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో చాలా మంది పేర్లు వినిపించాయి. కాజల్, సన్నీ, సిరి, యాంకర్ రవి, ప్రియ ఈ ఐదుగురు నామినేషన్స్‌లో ఉన్నప్పటికీ వారికి ఉన్న ఫాలోయింగ్ మంచి ఓట్లుపడుతున్నాయి. ప్రియాతో గొడవ విషయంలో రవి ఇమేజ్ డ్యామేజ్ అయినప్పటికీ ఓటింగ్ పరంగా వచ్చిన సమస్యేమీ లేదు. 


మిగిలిన లోబో, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ లలో.. లోబోకి మంచి ఎంటర్టైనర్ అనే పేరుంది. ప్రియా విషయంలో అతడు ప్రవర్తించిన తీరుతో నెగెటివ్ ఇంప్రెషన్ పడిందనే చెప్పాలి. కానీ నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ లతో పోల్చుకుంటే లోబోకి ఓట్లే పడ్డాయట. నటరాజ్ మాస్టర్ వ్యవహారశైలి కొన్ని రోజులుగా వివాదాస్పదంగా ఉంది. రవితో ఏదో విధంగా గొడవపడుతూనే ఉన్నారు. హౌస్ లో ఎలాంటి గ్రూపిజం చేయకుండా సింగిల్ గానే గేమ్ ఆడుతున్నారు. కానీ అతడికి పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడం, హౌస్ లో కాస్త వింతగా ప్రవర్తిస్తుండటంతో ఈ వారం అతడికి డేంజర్ జోన్ తప్పడం లేదని తెలుస్తోంది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కావడం ఖాయమని అంటున్నారు. 


Also Read: ప్రేమగా దగ్గరై.. పెళ్లితో ఒక్కటై.. చివరకు దూరమై..


Also Read: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్.. ఇక ఆ హీరోలకు కష్టమే..


Also Read: లోబో 'బస్తీ' కామెంట్స్ పై మండిపడ్డ నాగ్.. అందరూ ఒక్కటే అంటూ వార్నింగ్


Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు


Also Read: నాలుగేళ్ల క్రితం ఆగిన 'ఆరడుగుల బుల్లెట్' మెగా హీరోకి పోటీగా ఇప్పుడు దూసుకొస్తోంది..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి