బిగ్ బాస్ సీజన్ 5 ఐదు వారాలు పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికే నాలుగు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేషన్ కి మొత్తం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. వారిలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లబోతున్నారో క్లారిటీ వచ్చింది. ఎప్పటిలానే షణ్ముఖ్, మానస్ సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తరువాత సన్నీ, రవి సైతం మంచి ఓట్లను దక్కించుకొని సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఈ వారం తన ఆటతీరుతో ప్రేక్షకుల మద్దతును గెలుచుకున్న జెస్సీకి కూడా ఓట్లు బాగానే పడ్డాయి.
ముందు నుంచి నామినేట్ అవుతున్న ప్రియాకు సోషల్ మీడియాలో క్రేజ్ బాగానే ఉంది. వివాదాల జోలికి పోకుండా జెన్యూన్ గా ఆడుతుందనే ఫీలింగ్ జనాల్లో ఉంది. దీంతో ఆమె కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లింది. ఇక డేంజర్ జోన్ లో ఉన్నది ముగ్గురు కంటెస్టెంట్స్. విశ్వ, లోబో, హమీద. అయితే వీళ్లల్లో ఇంట్లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్ లోబో. ఓటింగ్ పరంగా కూడా ఈసారి కొద్దిలో లోబో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఇక విశ్వ విషయానికొస్తే.. ఈవారం చాలా అగ్రెసివ్ గా గేమ్ ఆడాడు. ఇంటిసభ్యులపై కూడా ఇష్టమొచ్చినట్లుగా విరుచుకుపడ్డాడు. రవి కోసమే గేమ్ ఆడుతూ కనిపించాడు. దీంతో అతడిపై ఒకరకమైన నెగెటివిటీ జనాల్లో ఏర్పడింది.
ఇకపోతే హమీద.. బిగ్ బాస్ కి రాకముందు వరకు కూడా ఆమె ఎవరో కూడా జనాలకు సరిగ్గా తెలియదు. ఇంట్లోకి వచ్చాక తన ఆటతీరుతో క్రేజ్ తెచ్చుకుంటుందేమో అనుకుంటే.. శ్రీరామచంద్రతో లవ్ ట్రాక్ మొదలెట్టింది. అలా ఈ బ్యూటీకి ఫేమ్ వచ్చింది. అయితే చిన్న చిన్న విషయాలతో హౌస్ మేట్స్ ని నామినేట్ చేయడం.. శ్రీరామచంద్ర కెప్టెన్ అయిన తరువాత రేషన్ మ్యానేజర్ గా మారిన హమీద చాలా యాటిట్యూడ్ చూపించింది. దీంతో హమీదాపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ లో ఉన్నంతసేపు శ్రీరామ్ చుట్టూ తిరుగుతుందే తప్ప.. టాస్క్ లు కూడా పెద్దగా ఆడడం లేదు. ఇవన్నీ హమీదకు మైనస్ గా మారాయి. దీంతో ఈ వారం అతడి తక్కువ ఓట్లతో ఆమె డేంజర్ జోన్ లో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె ఈ వారం ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది.
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి