ఈరోజు ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసిన నాగార్జున.. విన్నర్ ఏం గెలుచుకోబోతున్నారో చెప్పేశారు. రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు.. పాతిక లక్షల విలువైన ప్లాట్ ను కూడా దక్కించుకుంటారని చెప్పారు. ఆ ప్రైజ్ మనీ వస్తే ఎలా వాడాలనుకుంటున్నారో చెప్పమని నాగార్జున అడిగారు. 


  • ప్రియాంక - యాభై లక్షలు అనే నెంబర్ ఎప్పుడూ చేత్తో కూడా పట్టుకోలేదని.. తను ఆ డబ్బు గెలుచుకుంటే తల్లితండ్రులకు ఇల్లు కట్టించడంతో పాటు.. ఓ ఆడపిల్లను దత్తత తీసుకుంటానని చెప్పింది.

  • శ్రీరామ్ - తన తల్లిదండ్రులకు ఒక పెద్ద ఇల్లు కట్టించాలని కోరిక అని.. విన్నర్ గా గెలిస్తే ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు.



  • రవి - కొంత డబ్బుని కూతురు మిగిలిన డబ్బుతో టీవీ ప్రొడక్షన్ ను మొదలుపెట్టాలని ఉందని చెప్పాడు.

  • కాజల్ - ముప్పై లక్షల అప్పు ఉందని.. ఆ అప్పు తీర్చేస్తానని.. అలానే ఓల్డేజ్ హోమ్ కట్టించాలని కోరిక అని చెప్పింది.

  • సన్నీ - సెలూన్ పెట్టాలని కోరిక అని.. విన్నర్ గా గెలిస్తే దానికి వాడతానని చెప్పాడు.

  • మానస్ - ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టాలని కోరిక అని.. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనుందని చెప్పాడు.

  • షణ్ముఖ్ - పాతిక లక్షలు మా అమ్మకి, మరో పాతిక లక్షలు దీప్తికి ఇస్తానని చెప్పాడు. తన తల్లిదండ్రులు కొంతమంది ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేస్తున్నారని చెప్పాడు.

  • సిరి - శ్రీహాన్ పేరెంట్స్ కి కొంత అప్పు ఉందని అది తీర్చేస్తానని.. మిగిలిన డబ్బుని బ్లైండ్ పీపుల్ కి హెల్ప్ చేయడానికి వాడతానని చెప్పింది. 


 

షణ్ముఖ్ సేఫ్..: నామినేషన్ లో ఉన్నవారిని గార్డెన్ ఏరియాలో నిలబడమని చెప్పిన నాగార్జున.. షణ్ముఖ్ సేవ్ అయినట్లు అనౌన్స్ చేశారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో 'చిట్టిబొమ్మలు చెప్పే చిత్రం' అనే గేమ్ ఆడించారు నాగార్జున. 

 

ప్రియాంక సేఫ్..: నామినేషన్ లో మిగిలిన ముగ్గురు చేతిలో బాక్సులు పెట్టారు నాగార్జున. ఆ బాక్స్ లో ప్రియాంక సేఫ్ అని వచ్చింది. ఆ తరువాత కాజల్, రవి మిగలడంతో వారిద్దరికీ టెన్షన్ మొదలైంది. కాజల్ తో సన్నీ మాట్లాడుతూ.. 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' వాడతానని చెప్పాడు. దానికి కాజల్.. 'ఆడియన్స్ ఓటుతోనే వెళ్తానని' చెప్పింది. దీంతో ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు సన్నీ, మానస్. తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని.. పాస్ అవసరం ఉండదని కాజల్ అనింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం చాలా ఫైట్ చేశావని.. తీస్కో అంటూ సన్నీ మళ్లీ మళ్లీ చెప్పాడు. కాజల్ మాత్రం ఆడియన్స్ ఓట్లతోనే ఉంటానని నొక్కి చెప్పింది. 

 

రవి, కాజల్ లను గార్డెన్ ఏరియాలోకి పిలిచారు నాగార్జున. ఆడియన్స్ జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చేసిందని.. కానీ దాన్ని మార్చే పవర్ హౌస్ లో ఒక్కరికే ఉందని అన్నారు నాగార్జున. వెంటనే సన్నీ.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను పట్టుకొని వచ్చాడు. 'ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను నువ్ వాడుకుంటావా..? లేక వీరిద్దరిలో ఒకరిని సేవ్ చేయడానికి వాడతావా..? డిసైడ్ చేసుకొని చెప్పు' అని నాగార్జున సన్నీని అడిగారు. దానికి సన్నీ.. 'తనకు ఇద్దరూ ఇష్టమే' అని అన్నాడు. వెంటనే షణ్ముఖ్.. 'సన్నీ ఆలోచించు' అంటూ డైలాగ్ వేశాడు.

 

రవి ఎలిమినేషన్..: ఫైనల్ గా సన్నీ.. కాజల్ ముందు ఎవిక్షన్ ఫ్రీ పాస్ పెట్టేశాడు. ఆ పాస్ కాజల్ కారణంగానే వచ్చిందని చెప్పాడు. అయితే నామినేషన్ లో ఉన్న కాజల్ సేవ్ అయినట్లు అనౌన్స్ చేశారు. దీంతో రవి ఎలిమినేట్ అయ్యాడు. వెంటనే సన్నీ వెళ్లి రవిని హగ్ చేసుకున్నాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడలేకపోయినందుకు సారీ చెబుతూ ఏడ్చేశాడు సన్నీ. ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేని కాజల్ కూడా ఏడ్చేసింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ రవికి ఇచ్చి ఉంటే సేవ్ అయి ఉండేవాడని నాగార్జున అన్నారు. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను బిగ్ బాస్ కి తిరిగిచ్చేయాలని చెప్పారు.- రవి వెళ్లిపోతుండడంతో షణ్ముఖ్ కూడా ఏడ్చేశాడు. 


 

వెళ్లిపోతూ వెళ్లిపోతూ.. షణ్ముఖ్ చాలా మెచ్యూర్డ్ అని, తనకొక బ్రదర్ దొరికాడని అన్నాడు. శ్రీరామ్ లేట్ గా కనెక్ట్ అయినా.. బంధువు అయిపోయాడని చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్ అంటే ఏదైనా చేసేస్తాడని.. సన్నీపై ప్రశంసలు కురిపించాడు రవి. 'చేతులు కాలకుండా కాపాడుకునే బాధ్యత నీది. ఏదైనా ఆలోచించి చేయి' అంటూ ప్రియాంకకు చెప్పాడు. 'ఫెయిల్ అవుతాననే భయంతో గేమ్ ఆడకు' అని సిరికి చెప్పాడు రవి. మానస్ చాలా బాగా గేమ్ ఆడుతున్నడని చెప్పాడు. 'నువ్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వకూడదని' కాజల్ కి చెప్పాడు. 


 










ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి