నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి సన్నీ తల్లి కళావతి వచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆ ఎపిసోడ్ కంటిన్యూ అయింది. కళావతి అందరితో చాలా సరదాగా మాట్లాడారు. తన తల్లికి సన్నీ అన్నం తినిపించాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను గిఫ్ట్ గా తీసుకొచ్చిన కళావతి తన కొడుక్కి ఇచ్చింది. సన్నీతో మాట్లాడుతూ.. గేమ్ చాలా బాగా ఆడుతున్నావని, నాగార్జున గారు బాగా పదును పెడుతున్నారని.. ఒక్కసారి నన్ను ఆయనతో కలిపించరా..? అంటూ కళావతి తన కొడుకుని రిక్వెస్ట్ చేసుకుంది. 


ప్రియాంక అన్నీ అబద్ధాలే.. 
ప్రియాంక ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసమే సన్నీతో క్లోజ్ గా ఉంటుందనిపిస్తుందని కాజల్ తో మానస్ డిస్కస్ చేశాడు. తన బాయ్ ఫ్రెండ్ ని నాతో రీప్లేస్ చేసుకుందామని చూస్తుంది కానీ అది కుదరదని చెప్పేశా అని మానస్ అన్నాడు. ప్రియాంక చాలా అబద్ధాలు చెబుతుందని ఈ విషయంలో అసలు నచ్చదని కాజల్ తో అన్నాడు మానస్. 


అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోలేదు.. 
ఉన్న కొద్దిరోజులు మన పేరెంట్స్ ని హర్ట్ చేయకుండా నీట్ గా ఉందామని షణ్ముఖ్.. సిరికి చెప్పాడు. 'తండ్రి లేని కూతురువని అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకోలేదు. ఆ విషయం మాత్రం మీ అమ్మ గారికి చెప్పు' అంటూ షణ్ముఖ్ తన ఫీలింగ్ బయటపెట్టాడు. 
తెల్లవారుజామున ప్రియాంక సిస్టర్ మధువు రావడంతో ఆమె ఎమోషనల్ అయింది. రాగానే ఆమె వెళ్లి మానస్ కి సారీ చెప్పింది. గేమ్ బాగా ఆడుతున్నావని.. ఇంకా ఫోకస్ చేయాలని చెప్పింది మధు. 


హౌస్ లో రవి కూతురు.. 
ఆ తరువాత హౌస్ లోకి రవి భార్య నిత్య వచ్చింది. తన కూతురు వియు రాలేదా అని అడిగాడు రవి. చాలా ట్రై చేశానని కానీ తీసుకురాలేకపోయానని చెప్పింది నిత్య. కాసేపటికి వియా వాయిస్ వినిపించడంతో.. రవి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. కూతురుని హత్తుకొని ముద్దాడాడు. రవి ఆనందానికి అవధుల్లేవు. ఆ తరువాత ''రవికి అంత సీన్ లేదని.. ఇన్ఫ్లుయెన్స్ చేయడని.. మీరే సీన్ ఇస్తున్నారని'' నిత్య ఫన్నీగా షణ్ముఖ్ దగ్గర కామెంట్ చేసింది. రవి కూతురు వియా.. బిగ్ బాస్ అంకుల్ ఎక్కడ..? అని రవిని అడిగింది. 'బిగ్ బాస్ అంకుల్ ఒకసారి చూస్తా మిమ్మల్ని' అంటూ క్యూట్ గా అడిగింది. హౌస్ మేట్స్ అందరూ కలిసి వియుతో డాన్స్ చేస్తూ.. గేమ్స్ ఆడుకున్నారు. ఇక హౌస్ నుంచి వెళ్లిపోయే సమయంలో వియు తన తండ్రిని పట్టుకొని బాగా ఏడ్చేసింది. కూతురుకి సర్దిచెప్పి హౌస్ నుంచి పంపించాడు రవి. 


నీ గేమ్ నువ్ ఆడు.. 
కాసేపటికి షణ్ముఖ్ తల్లి హౌస్ లోకి వచ్చింది. తన తల్లిని చూసిన వెంటనే షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత తన కెప్టెన్సీ బ్యాండ్ ను తన తల్లి చేతికి పెట్టి మురిసిపోయాడు. 'నీ మోజ్ రూమ్ చూడాలి నేను' అంటూ ఆమె అడగడంతో షణ్ముఖ్ తీసుకెళ్లి చూపించాడు. 'నీ గేమ్ నువ్ ఆడు.. ఎవరు అలిగినా కూడా నువ్ డైవర్ట్ అవ్వకు..' అంటూ పరోక్షంగా సిరి గురించి చెప్పింది షణ్ముఖ్ తల్లి. షణ్ముఖ్.. ఎవరితో తన బాండ్ బావుందని రవి, సిరి పేర్లను తీసుకురాగా.. అందరితో ఉండు అని షణ్ముఖ్ తల్లి చెప్పింది. 'దీపుని కలిశావా..?' అని షణ్ముఖ్ అడగ్గా.. 'కలిశాను..' అని చెప్పింది అతడి తల్లి. 'నువ్వు అబద్ధం చెబుతున్నావ్' అని అనగా.. 'అమ్మ అబద్ధం చెబుతుందా..?' అని అన్నారు.  'వంద సార్లు అడక్కు.. బావుంది' అని చెప్పింది షణ్ముఖ్ తల్లి. ఆ తరువాత సిరి ఎగురుకుంటూ మోజ్ రూమ్ లోకి వచ్చింది. 'ఏంటి ఆంటీ సంగతులు' అని సిరి అడగ్గా.. 'గేమ్ గేమ్ లా చూడండి. ఎక్కువ ఎమోషనల్ అయిపోవద్దు' అని డైలాగ్ వేసింది షణ్ముఖ్ తల్లి. 'రేపటి నుంచి వేరేలా చూస్తారంటూ' సిరి చెప్పింది.  


Also Read:'2021 నాకో రఫ్ ఇయర్..' సమంత వీడియోపై ఫ్యాన్స్ కామెంట్స్..



Also Read: 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మ లాంటి పాట... 'జనని' వచ్చేసింది! చూశారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి