బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. హిందీలో మొదలైన ఈ షో ఇప్పుడు సౌత్ కి కూడా పాకింది. సౌత్ ఇంకా ఐదో సీజన్ లో ఉండగా.. హిందీలో మాత్రం 15వ సీజన్ నడుస్తోంది. తాజాగా హిందీ బిగ్ బాస్ సీజన్ 15లో అపశృతి చోటుచేసుకుంది. టాస్క్ లో ఓడిపోయినందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అఫ్సానా ఖాన్‌ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాకయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం హౌస్ కెప్టెన్ గా కొనసాగుతున్న ఉమర్ రియాజ్ కి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. 


Also Read: షన్నుని ఆడుకున్న సిరి.. రవికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్..


కరణ్‌ కుంద్రా, నిషాంత్‌ భట్‌, తేజస్వి ప్రకాశ్‌, అఫ్సానా ఖాన్‌లలో ముగ్గురిని మాత్రమే వీఐపీ టికెట్‌ కోసం ఎంచుకోవాల్సి ఉంటుందని సూచించారు. దీంతో రియాజ్.. అఫ్సానా ఖాన్‌ కి ఛాన్స్ ఇవ్వకుండా మిగిలిన ముగ్గురిని ఎంపిక చేసుకున్నాడు. దీంతో అఫ్సానా తట్టుకోలేకపోయింది. అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని.. నమ్మిన స్నేహితులే తనను మోసం చేస్తున్నారని ఎమోషనల్ అయిపోయింది. 


అక్కడ ఉన్న ఓ కత్తిని తీసుకొని తనను తానే గాయపరుచుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే అలెర్ట్ అయిన రియాజ్, కరణ్ ఆమెను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తరువాత అఫ్సానాను హౌస్ నుంచి బయటకు పంపించారని సమాచారం. మరి తిరిగి ఆమెని హౌస్ లోకి తీసుకొస్తారో లేదో చూడాలి. 


ఇదిలా ఉండగా.. అఫ్సానా ఖాన్ కారణంగా బిగ్ బాస్ హౌస్ లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఆమె చేసిన తప్పుల వలన కొన్నిసార్లు హౌస్ మేట్స్ కూడా శిక్ష అనుభవించాల్సి వస్తోంది. దీంతో ఆమె తీరుని మార్చుకోవాలని పలువురు కంటెస్టెంట్లు చెప్పడానికి ప్రయత్నించినా.. ఆమె మాత్రం వినిపించుకునేది కాదు. ఇప్పుడు తన ప్రవర్తన కారణంగానే హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. 






Also Read:  రంగమ్మత్తను మించి ద్రాక్షాయణి.. వామ్మో అందమైన అనసూయ ఇలా అయిపోయిందే...


Also Read: పెళ్లైందని మర్చిపోయారా… ఆమెతో రొమాన్స్ ఏంటి..


Also Read: సీక్రెట్ రూమ్ లో జెస్సీ.. రవికి వార్నింగ్ ఇచ్చిన షణ్ముఖ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి