Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలేకు ఒకరోజు ముందు ఇంట్లో సందడి నెలకొంది. గత సీజన్లోని కంటెస్టెంట్లంతా వచ్చి హంగామా చేశారు. మొదటిగా రోల్ రైడా అడుగుపెట్టాడు. అందరితోనూ కబుర్లు చెప్పాడు. పాటలు పాడాడు. బీబీ జోడీ కార్యక్రమం పాటను ప్రసారం చేసి కంటెస్టెంట్ల చేత డ్యాన్సులు వేయించాడు. కీర్తికి బర్గర్ ఇచ్చాడు రోల్ రైడా. తరువాత అషూ రెడ్డి, మెహబూబ్ కలిసి జంటగా ఇంట్లోకి అడుపెట్టారు. ఇద్దరూ కంటెస్టెంట్లతో ఆట ఆడించారు. శ్రీహాన్ - రేవంత్ మధ్య మొదట ఆడించారు. వీరిద్దరిలో ఇద్దరూ  ఓడిపోయారు. తరువాత కీర్తి - ఆదిరెడ్డి ఆడారు. ఒకరు అడిగిన ప్రశ్నలకు మరొకరు తప్పు జవాబులు చెప్పాలి. అదే కరెక్టు జవాబులు చెబితే ఓడిపోయినట్టు. అయితే కీర్తి ‘శ్రీహాన్ లవర్ పేరు ఏంటి?’ అని అడిగింది. దానికి ఆదిరెడ్డి ‘ఇనాయ’ అని చెప్పాడు. దీంతో శ్రీహాన్ ఆదిరెడ్డిని కొట్టడానికి వెళ్లాడు. కాసేపు కామెడీ సీన్ క్రియేట్ అయింది. తరువాత అందరూ కలిపి బ్లాక్ బస్టర్ పాటకు చిందు లేశారు. మాతో పాటు ఒకరిని తీసుకెళ్తామని చెప్పి ప్రాంక్ చేశారు. ఈ ప్రాంక్‌‌తో కాసుపు కంగారు పడ్డారు ఇంటి సభ్యులు. 


అవినాష్ ఎంట్రీ
బిగ్ బాస్ సీజన్ 4లో నవ్వించిన అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే తన డ్యాన్సుతో నవ్వించాడు. కన్నెపెట్టెరో కన్నుకొట్టరో పాటకు కామెడీగా డ్యాన్సు చేశాడు. వెంటనే అరియానా కూడా వచ్చేసింది.  తన పంచింగ్‌లతో నవ్వించింది. బీబీ జోడీలో అవినాష్ - అరియానా జంటగా డ్యాన్సు చేస్తున్నారు. అవినాష్ పొట్ట కారణంగా తమ డ్యాన్సు సరిగ్గా రావడం లేదని, తనకు ఎవరైనా జోడీ కావాలని అడిగింది అరియానా. అవినాష్ పొట్టపై కాసేపు జోకులు వేసుకున్నారు.  ప్రతి ఇంటి సభ్యుడి చేత డ్యాన్సులు వేయించారు. రోహిత్ చాలా బాగా వేశాడు. 


కాజల్ - చైతూ 
బిగ్ బాస్ సీజన్ 5లో చురుగ్గా ఆడిన కాజల్ చైతూతో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇద్దరూ కలిసి ‘కలర్ ఫుల్ చిలుక’ పాటకు డ్యాన్సు వేసింది.వీరిద్దరూ చేతికి ప్రోపర్టీ (ఏదైనా వస్తువు) ఇచ్చి డ్యాన్సు చేయించారు. ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరికీ ఒక్కోటి ఇచ్చి ఫన్నీ డ్యాన్సులు వేయించారు.  తరువాత భానుశ్రీ - రవి కృష్ణ కూడా వచ్చారు. వీరు కూడా ఇంటి సభ్యుల చేత రకరకాల ఆటలు ఆడించారు. 


అఖిల్ - తేజు
బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తుల్లో అరియానా, అఖిల్ ఉంటారు. రెండు సీజన్లలో వారు టాప్ 5 వరకు ఉన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చింది ఇంటి సభ్యుల చేత ఆటలు ఆడించారు. బీబీ జోడీలో... వీరిద్దరూ డ్యాన్స్ పార్ట్ నర్లు. దీంతో వీరిద్దరూ కలిసి డ్యాన్సు చేసి అలరించారు. వీరితో పాటూ టాప్ 5 కంటెస్టెంట్లంతా చాలా చక్కగా డ్యాన్సులు వేశారు. 


Also read: డబ్బు కోసమే బిగ్‌బాస్‌కు వచ్చిన శ్రీసత్య మొత్తంగా ఎంత సంపాదించిందంటే...