‘బిగ్ బాస్’ సీజన్ 6 ముగింపు దశకు వచ్చేసింది. ఆదివారం జరిగే ఫినాలేతో షో ముగియనుంది. ఈ సీజన్ ‘బిగ్ బాస్’ విన్నర్ ఎవరో కూడా తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ‘బిగ్ బాస్’ అభిమానులు ఫినాలే కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో మరో షాకింగ్ న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. ‘బిగ్ బాస్’ షోకు నాగార్జున వీడ్కోలు తెలపనున్నారని, ఆయన స్థానంలో మరో సెలబ్రిటీ రానున్నారనే టాక్ నడుస్తోంది. వాస్తవానికి ‘బిగ్ బాస్’ వంటి షోస్ తనకు ఇష్టం ఉండదని నాగార్జున ఎప్పుడో ఓ సందర్భంలో చెప్పారు. అయితే, ఎన్టీఆర్, నానీలు ఆ షోను వదిలేయడం వల్ల ఆ ఆఫర్ నాగార్జునను వరించింది. దీంతో ఆ షో బాధ్యతలను నాగార్జున తన భుజాలపై ఎత్తుకున్నారు. మొత్తం నాలుగు సీజన్లు, ఒక ఓటీటీ వెర్షన్‌ను విజయవంతంగా నిర్వహించి నాగార్జున.. బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. అయితే, ఆయన ఇక ఆ షోకు హోస్ట్‌గా వ్యవహరించరనే వార్త బయటకు వచ్చేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు. 


హోస్ట్‌గా.. ఎన్టీఆర్, నాగ్ బెస్ట్


‘బిగ్ బాస్’ 2017లో మొదలైంది. దీనికి ఎన్టీఆర్ హోస్ట్ అని తెలియడంతో ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది. పైగా మంచి కంటెస్టెంట్లను సెలబ్రిటీలను ఎంపిక చేయడంతో రసవత్తరంగా సాగింది. అయితే, ఆ తర్వాతి సీజన్‌లో ఎన్టీఆర్‌కు స్థానంలో నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ సీజన్ కూడా విజయవంతంగానే సాగింది. నానీ తర్వాత అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, షోస్‌ను ఎంతో సమర్థవంతంగా, విజయవంతంగా కొనసాగించారు. పెద్దగా పాపులారిటీలేని ఓటీటీ వెర్షన్‌ను సైతం ఆయన సక్సెస్ చేశారు. కానీ, ‘బిగ్ బాస్’ సీజన్-6 ఎందుకో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదనే టాక్ ఉంది. దీనిపై నాగార్జున కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ సెలక్షన్‌లో ఈ సారి తడబడ్డారేమో అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. అలాగే, ఈసారి ‘బిగ్ బాస్’లో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్స్ జరిగాయని, వాటిని చూస్తే నాగార్జున ఎలా సైలెంట్‌గా ఉన్నారని పలువురు ట్రోల్ చేస్తున్నారు. చెప్పలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో హోస్ట్ నాగార్జునపై ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున తదుపరి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తారా? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలైతే ‘బిగ్ బాస్’ సీజన్-7కు నాగ్ హోస్ట్‌గా వ్యవహరించరనే వార్తలు ఇస్తున్నాయి. 


నాగార్జున రెమ్యునరేషన్‌పై కూడా చర్చ 


మరోవైపు ‘బిగ్ బాస్’ హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్‌పై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నాగార్జున ‘బిగ్ బాస్’ 3, 4, 5, ఓటీటీ సీజన్ల వరకు ఎపిసోడ్‌కు రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు తీసుకున్నట్లు తెలిసింది. మొత్తంగా రూ.12 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అయితే, ‘బిగ్ బాస్’ సీజన్-6కు మాత్రం రెమ్యునరేషన్‌లో మార్పులు చేసినట్లు తెలిసింది. మొత్తం ఎపిసోడ్స్ అన్ని కలిసి సుమారు రూ.14 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు నాగ్ తన రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 


Read Also: ‘అవతార్‌-2’ మూవీకి అక్షయ్ కుమార్ రివ్యూ: కామెరూన్ ప్రతిభకు తలవంచాల్సిందేనట!