‘బిగ్ బాస్ నాన్‌స్టాప్’కు పుల్‌స్టాప్ డే వచ్చేసింది. పాత, కొత్త కలయికతో సరికొత్త కాన్సెప్ట్‌తో 24 గంటల లైవ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఓటీటీ’ సీజన్-1.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. టీవీలో రెగ్యులర్‌గా ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’ సీజన్స్ కంటే.. ఓటీటీ సీజన్‌ ప్రజాధారణ పొందలేనట్లు సమాచారం. పైగా, పాత కంటెస్టెంట్లలో మంచి పాపులారిటీని సంపాదించిన అఖిలే ఈ సీజన్‌లో నెంబర్ వన్ అని టాక్ రావడం కూడా ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. అయితే, అది ఆరంభంలో. ఎప్పుడైతే ‘బిందు’ తన ఉగ్రరూపం చూపించడం మొదలైందో.. అప్పటి నుంచి ప్రేక్షకులకు ఈ సీజన్‌పై ఆసక్తి మొదలైంది. 


బిందు ఒక వైపు అఖిల్‌, ఇతర కంటెస్టెంట్లను ధైర్యంగా ఎదుర్కొంటూ స్ట్రాంగ్‌గా మారింది. దీనికి తోడు నటరాజ్ మాస్టార్‌.. ఆమెకు ఎన్ని చుక్కలు చూపించినా.. బిందు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా తన పవర్ చూపడం ప్రేక్షకులకు నచ్చేసింది. ఈ నేపథ్యంలో బిందుకు ఓటింగ్ ఒక్కసారే పెరిగిపోయింది. పైగా, ఆమెతోపాటు యాంకర్ శివకు కూడా ఎక్కడాలేని పాపులారిటీ లభించింది. దీంతో అఖిల్‌ను బ్యాడ్ లక్ మరోసారి పలకరించింది.ఈ సారి మళ్లీ నెంబర్ 2తోనే సరిపెట్టుకొవలసి వచ్చింది. అయితే, ఇన్ని రోజులు ‘అఖిలే నెంబర్ వన్’ అని అనుకున్న ఆయన అభిమానులకు దీన్ని ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. 


Also Read: బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో తొలిసారి - విన్నర్‌గా లేడీ కంటెస్టెంట్


‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-4లో కూడా అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఓటీటీ వెర్షన్‌లో తప్పకుండా నెంబర్ వన్ స్థానంలో నిలవాలనే టార్గెట్‌తో ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. కానీ, బిందు రాకతో పరిస్థితులు మారిపోతాయని మాత్రం ఊహించుకోలేకపోయాడు. సీజన్-4లో అఖిల్.. అభిజీత్‌కు గట్టిపోటీ ఇచ్చాడు. కానీ, చివరికి అభిజీత్ విజేతగా నిలిచాడు. కానీ, వీరిద్దరి కంటే.. సోహెల్ హీరో అయ్యాడు. ప్రైజ్ మనీలో దాదాపు సగం సోహెల్ తనతో తీసుకెళ్లిపోయాడు. అతడి తెలివైన నిర్ణయం వల్ల అభికి ఫుల్ ప్రైజ్ మనీ లభించలేదు. గత సీజన్‌తో పోల్చితే అఖిల్ చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాడు. చెప్పాలంటే ఒక కొత్త అఖిల్ కనిపించాడు. ఆ ఒక్క విషయంలో అఖిల్ జనాలకు కూడా నచ్చేశాడు. ‘అఖిలే నెంబర్ వన్’ అనుకున్నారు. కానీ, నటరాజ్ మాస్టార్ ‘బిందు’కు పరోక్షంగా ప్లస్ అయ్యారు. నటరాజ్ ఆమెను టార్గెట్ చేసుకోవడంతో ప్రేక్షకులు అఖిల్‌ను వదిలి బిందు వైపు మొగ్గు చూపారు. ఫలితంగా అఖిల్ రెండోసారి కూడా ‘బిగ్ బాస్’ ట్రోపీకి దూరమయ్యాడు. అయితే, అఖిల్ ఈ సారి కూడా అందరి మనసులు గెలుచుకున్నాడనే చెప్పుకోవాలి. 


Also Read: క్యాష్‌‌తో అరియానా ఔట్, దొంగ సచ్చినోళ్లంటూ అనిల్, సునీల్‌పై ఆగ్రహం