Bigg Boss 6 Telugu Live Updates: 'బిగ్ బాస్ 6' షురూ - ఫైమా ‘జబర్దస్త్’ ఎంట్రీ, భావోద్వేగంతో గుండె బరువెక్కించేసింది

బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్-6 ఈ రోజు (04.09.2022) మొదలైంది. 'విక్రమ్'లో కమల్ హాసన్ డైలాగుతో షో స్టార్ట్ చేసిన నాగార్జున

ABP Desam Last Updated: 04 Sep 2022 09:54 PM

Background

తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకెళ్తున్న బిగ్ బాస్(Bigg Boss) మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు 6వ సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైపోతోంది. ఈ హౌస్‌లోకి ఎంటరయ్యే సెలబ్రిటీల ఎంపిక, క్వారంటైన్ వంటి...More

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ప్రవేశించిన మొత్తం కంటెస్టెంట్లు వీళ్లే

బిగ్ బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించిన మొత్తం కంటెస్టెంట్లు వీళ్లే:


1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్  (సింగర్)