బిగ్‏బాస్ సీజన్ 5 ప్రారంభమైన రెండో రోజు నుంచే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆహా ఓహో అనుకున్న కంటిస్టెంట్స్ ఆ తర్వాతి రోజు నుంచీ హడావుడి మొదలెట్టేశారు. గ్రూపులుగా విడిపోయి చిన్న చిన్న విషయాలకే రచ్చ చేశారు. నామినేషన్లు మరింత చిచ్చు పెట్టాయి. ఈ మేరకు మొదటి వారం సరయు ఎలిమినేట్ అయింది. రెండోవారం కూడా నామినేషన్లు వామ్మో అనిపించేలా జరిగాయి. ఒకరికొకరు ఇచ్చి పడేసుకున్నారు. ఈ వారం నామినేట్ అయినవారిలో ఎవరు బయటకు వస్తారో కానీ…ఈ లోగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని టాక్.


ఒకేసారి 19 మంది కంటెస్టెంట్స్‏ను హౌస్‏లోకి పంపేయడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందో లేదో అనుకున్నారు. కానీ త్వరలో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని ఈ మేరకు ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందనే చర్చ జరుగుతోంది. పైగా ప్రస్తుతం హౌస్ లో చాలామంది ఇంకా తెలియని ముఖాలున్నాయి. ప్రేక్షకులు కూడా కొందరి రచ్చ చూసి బోర్ ఫీలవుతున్నారట. అందుకే హాట్ బ్యూటీస్ ని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్ చేస్తే లెక్కలు మారిపోతాయనే భావనలో ఉన్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే బుల్లితెరపై టాప్ యాంకర్స్‏లలో ఒకరైన వర్షిణీ, సీరియల్స్ తో పాపులారిటీ  సంపాదించుకున్న నవ్యస్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారట. అయితే ఒకే వారంలో  ఇద్ద‌రి ఎంట్రీ ఉంటుందా? లేక ఒక్కొక్క వారం ఒక్కొక్క‌రు ఎంట్రీ ఇస్తారా అన్నది తెలియాలి.


Also read: పూలచీరలో బుల్లితెర బ్యూటీ..వైరల్ అవుతోన్న వర్షిణి ఫొటోషూట్


టీవీషోస్‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న యాంక‌ర్ వ‌ర్షిణి సోష‌ల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాటు అందాల ప్రదర్శన ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది. న‌వ్వ‌స్వామి నా పేరు మీనాక్షి, వాణి రాణి, ఆహ్వానం, ఆమెకథ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నవ్యస్వామి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైతే మాత్రం కథ వేరేఉంటదంటున్నారు ప్రేక్షకులు.


Also read: నీలాంబరి నుంచి శివగామి వరకూ అందంతో పాటూ నటనలోనూ సరిలేరు తనకెవ్వరు అనిపించుకున్న రమ్యకృష్ణ బర్త్ డే స్పెషల్


Also Read: మన కూతుళ్లు సురక్షితమేనా... కడుపు తరుక్కుపోతోంది... మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్


Also read: 'ఏంది నీ లొల్లి..' కాజల్ పై శ్రీరామచంద్ర ఫైర్.. విశ్వను ఛీ కొట్టిన రవి..


Also read: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. రంగంలోకి సజ్జనార్.. ఈసారి ఇలా ఆదేశాలిచ్చారు