నిన్న నామినేషన్ ప్రాసెస్ లో చోటుచేసుకున్న డిఫరెన్సెస్ ను సార్ట్ అవుట్ చేసుకొనే ప్రయత్నం చేశారు కొందరు హౌస్ మేట్స్. ఈ క్రమంలో ముందుగా రవి.. నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి.. 'ఎందుకు అన్నీ ఊహించుకుంటున్నారని' ప్రశ్నించాడు. దానికి ఆయన.. 'నేనేం ఊహించుకోవడం లేదు.. ఆ నామినేషన్ ఓట్లు ఎలా పడ్డాయో కూడా నాకు తెలుసు..' అని అనగా.. 'మీ దగ్గర గట్టి ప్రూఫ్ ఉంది కదా.. నేనే ఎక్కిస్తున్నా అందరికీ మీ మీదా అని' అనగా.. 'నువ్వెందుకు అనుకుంటున్నావు' అంటూ కౌంటర్ ఇచ్చారు నటరాజ్ మాస్టర్. 'మీరు నాతోనే సరిగ్గా మాట్లాడడం లేదని' రవి అనగా.. 'అలా ఏం లేదని.. నీతో జోక్స్ కూడా వేస్తున్నా' అంటూ నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చారు. 


శ్వేతావర్మ.. ప్రియాంకతో డిస్కషన్ పెట్టింది. లోబో తనను నామినేట్ చేస్తూ గేమ్ ఆడడం లేదనే రీజన్ ఇచ్చాడని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ప్రియాంక ఓదార్చే ప్రయత్నం చేసింది. 'కొన్ని సందర్భాల్లో నేను లేను.. కానీ నా రిక్వైర్మెంట్ ఉన్నచోట నేను ఉన్నాను.. డబుల్ స్టాండర్డ్స్ అందరూ..' అంటూ శ్వేతా తన అభిప్రాయాన్ని చెప్పింది. 'ఉమా గారు ఆ వయసులో ఉండి అలాంటి మాటలు ఎలా మాట్లాడతారు.. ఆర్ట్ ఫీల్డ్ లో ఉండి ఆమె నోటి నుంచి వచ్చే మాటలేంటి..?' అంటూ మండిపడింది శ్వేతా. 


ఇక 'నామినేషన్స్ సమయంలో నటరాజ్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ నాకు అసలు నచ్చలేదంటూ' సిరి.. రవితో చెప్పింది. అందరూ సేఫ్ గేమ్స్ ఆడుతున్నారని ప్రియా.. ఉమాదేవితో చెప్పింది. తను జైలుకి వెళ్లినప్పుడు చాలా మంది తనను ఎక్కి తొక్కేశారని.. కొందరు విమెన్ కార్డ్ వాడి నన్ను రాంగ్ గా పోట్రె చేయడానికి ప్రయత్నించారని జెస్సీ.. శ్రీరామచంద్రతో అన్నాడు.  


ఇక లోబో తనను నామినేట్ చేయడం గురించి డిస్కషన్ పెట్టిన రవి.. 'మంచి దారిలో తీసుకెళ్దాం.. ఫ్రెండ్షిప్ కి ఒకఉదాహరణ క్రియేట్ చేద్దామని నేను చేస్తుంటే.. వాళ్లని, వీళ్లని చేయలేనని నన్ను నామినేట్ చేస్తున్నాడు' అంటూ లోబోపై మండిపడ్డాడు.


అనంతరం బాత్రూమ్ లో ఉన్న ఉమాదేవితో మాట్లాడే ప్రయత్నం చేశాడు సన్నీ. 'కోపం ఉండాలి.. ప్రేమ ఉండాలి' అని ఆమెకి చెప్పగా.. 'ప్రేమ తీసుకోవట్లేదు కదా.. కోపమే తీసుకుంటున్నారు' అని ఉమాదేవి అరుస్తూ చెప్పింది. 'ఒకసారి ప్రేమగా మాట్లాడండి' అని సన్నీ చెప్పగా.. 'నేను ఎవరితోనైనా ఇలానే మాట్లాడతానని.. ఇంట్లో నా మొగుడితో కూడా ఇలానే మాట్లాడతా' అని చెప్పింది. దానికి సన్నీ.. ఇక్కడ రకరకాల మైండ్ సెట్స్ తో ఉన్నవాళ్లు ఉన్నారని సన్నీ చెబుతుండగా.. నా మైండ్ సెట్ నాది నచ్చితే యాక్సెప్ట్ చేస్తే చేస్తారు లేకపోతే లేదంటూ మండిపడింది.


ఇక సన్నీ గురించి రవి,సిరి, షణ్ముఖ్ లు మాట్లాడుకున్నారు. అసలు సన్నీ బయట ఇలా ఉండడని సిరి.. 'కూల్ డూడ్ లా ఉండాలనుకుంటున్నారు.. కానీ అది తను కాదని' రవి అన్నారు. అనంతరం సన్నీ.. నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి గుంట నక్క ఎవరని పరోక్షంగా అడ్డాగా.. 'వచ్చేసిందిగా అడగడానికి..' అంటూ రవిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. 'కపటపు కౌగిళ్లు, కపటపు హ్యాండ్ షేక్స్ నాకు నచ్చవ్.. వంద కెమెరాలు ఉన్నాయని నటించలేను' అంటూ సన్నీతో అన్నారు నటరాజ్ మాస్టర్. 


ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కొన్ని గేమ్స్ ఆడించారు. ముందుగా 'దొంగలున్నారు జాగ్రత్త..' ఆ తరువాత 'సాగరా సోదరా..'  అనే రెండు టాస్క్ లు ఇచ్చారు. ఇవి ఫిజికల్ టాస్క్ లు కావడంతో.. హౌస్ మేట్స్ అంతా రెచ్చిపోయి ఆడేశారు. 
సన్నీ తన టీషర్ట్ లోపల చేయి పెట్టి టాస్క్ కి సంబంధించిన బ్యాటెన్స్ తీశాడని సిరి గోల గోల చేసింది. కానీ తను అలా చేయలేదని.. శ్వేతాను పిలిపించి బ్యాటెన్స్ ను తీయించానని అతడు చెప్పాడు. ఇంతలో షణ్ముఖ్ వచ్చి.. 'బాడీలో ఉన్నవి ఎలా తీస్తారు..? సన్నీ ఇది కరెక్ట్ కాదు.. ఎథిక్స్ అనేవి ఉంటాయి కదా' అని అన్నాడు.


ఓ పక్క కంటెస్టెంట్స్ అందరూ గేమ్ లో నిమగ్నమై ఉండగా.. లోబో కళ్లు తిరిగి పడిపోయాడు. అతడికి పానిక్ ఎటాక్ రావడంతో ట్రీట్మెంట్ కోసం హౌస్ మేట్స్ డాక్టర్ ఉన్న రూమ్ కి తీసుకెళ్లారు. దీంతో గేమ్ కాసేపు పాజ్ చేశాయి రెండు టీమ్స్. కానీ కొందరు హౌస్ మేట్స్ గేమ్ ఆడడంతో రవి ఫైర్ అయ్యాడు. ఈ విషయంలో విశ్వకు, రవికి మధ్య గొడవ జరిగింది. రవి అయితే 'ఛీ' అంటూ మండిపడ్డాడు. విశ్వ కూడా గట్టిగానే అరిచాడు. అనంతరం రవి.. విశ్వ దగ్గరకు వెళ్లి.. ''ఒక్క మాటే అన్నాను.. ఇలాంటి డ్రామాలు చేసి గేమ్ ఆడతారా..?'' అని.. అంతే ఇక్కడితో వదిలేయ్ అన్నా అని చెప్పగా.. విశ్వ కూడా లైట్ తీసుకున్నాడు. 


టాస్క్ లో శ్రీరామచంద్ర.. కాజల్ పై ఫైర్ అయ్యాడు. 'ఏంది నీ లొల్లి.. వచ్చినప్పుడు నుండి నన్ను టార్గెట్ చేస్తుంది' అంటూ కాజల్ ని ఉద్దేశిస్తూ హౌస్ మేట్స్ కి చెప్పాడు. అతడు ఆవేశంతో ఊగిపోతుంటే హౌస్ మేట్స్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.