‘బిగ్ బాస్‘ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సోహెల్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆయనకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి. తాజాగా అతడు నటించిన సినిమా ‘లక్కీ లక్ష్మణ్‘. ఈ నెల 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తన సినిమా ప్రమోషన్ ను వెరైటీగా నిర్వహించాలి అనుకున్నాడు. అదికాస్తా మిస్ ఫైర్ అయి, ప్రాణాల మీదకు వచ్చింది.






యూట్యూబర్ లోకల్ భాయ్ తో కలిసి మూవీ ప్రమోషన్


సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన యూట్యూబర్ లోకల్ భాయ్ నానితో కలిసి తన మూవీ ప్రమోషన్ చేయాలి అనుకున్నాడు.  సెలబ్రిటీలతో సమానమైన క్రేజ్ ఉన్న లోకల్ భాయ్ నాని  వైజాగ్ కుర్రాడు.  సముద్రంలో చేపల వేటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఆయనతో కలిసి తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు బిగ్ బాస్ సోహెల్ వైజాగ్ కు వెళ్లాడు. మాస్ లుక్ లో కనిపించేందుకు లుంగీ కట్టి, తలకు తలపాగా చుట్టి కనిపించాడు. నాని, సోహెల్ కలిసి బోటులో సముద్రంలోకి వెళ్లి చేపల వేట మొదలు పెట్టాలనుకున్నారు.  


సముద్రంలో పడిపోయిన సోహెల్, నీళ్లలోకి దూకి కాపాడిన నాని


బోటు చివరన నిలబడి చేపలు ఎలా పడతారో నాని చూపిస్తున్నాడు. వల ఎలా విసరాలి? ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగించడం ద్వారా ఎక్కువ చేపలు పట్టవచ్చు? అనే విషయాలను వివరించాడు. నాని చెప్పినట్లుగానే  సోహెల్  చేపలు పట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, చేపలు పట్టే క్రమంలో ఒక్కసారిగా కాళ్లు పట్టు తప్పడంతో సోహెల్ సముద్రంలో పడిపోయాడు. వెంటనే బోటు నడిపే వ్యక్తి కేకలు వేశాడు. అప్రమత్తం అయిన నాని వెంటనే నీళ్లలోకి దూకి సోహెల్ ను పట్టుకున్నాడు. లోపలికి మునిగిపోకుండా కాపాడాడు. అదే సమయంలో బోటులోని వాళ్లు తాళ్ల సాయంతో తనను బోట్ లోకి తీసుకొచ్చారు. సోహెల్ కు క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. కానీ, ఓ రేంజిలో షాక్ కు గురయ్యాడు. సోహైల్ మోకాళ్ళకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. సముద్రంలో ఈ ప్రమాదం జరగడంతో అందరూ కంగారుపడ్డారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను లోకల్ బాయ్ నాని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదంతా ప్రమోషన్ లో భాగమేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.



Read Also: రష్యాలో ‘పుష్ప‘కు గట్టి ఎదురుదెబ్బ, మూవీ డిజాస్టర్ - రూ.3 కోట్లు నష్టం?