'బిగ్ బాస్' సీజన్-6 రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్ కెప్టెన్ ఎంపిక కోసం టాస్కులు కొనసాగుతున్నాయి. శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య కెప్టెన్సీ టాస్కులకు ఎంపికయ్యారు. ఇక ఈ రోజు (శుక్రవారం) ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో 'ఎత్తర జెండా' టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే వచ్చింది. ఇక తాజాగా మరో ప్రోమో బయటకొచ్చింది. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఒక యాక్టివిటీ ఇచ్చారు.
దాని పేరు 'నేను ఎంతలా కనిపిస్తున్నాను'. హౌస్ మేట్స్ అందరూ తమ పెర్ఫార్మన్స్ ను బట్టి షోలో ఎంతలా కనిపిస్తున్నారో చెప్పాలనేది యాక్టివిటీ. ఇందులో జీరో నుంచి టెన్ మినిట్స్ వరకు టైమింగ్ ఉంది. ఒక్కో హౌస్ మేట్ తమ పెర్ఫార్మన్స్ ని బట్టి ఎన్ని నిమిషాలు కనిపిస్తున్నారో చెప్పాలి. ఈ క్రమంలో రేవంత్ అందరికంటే ఎక్కువ తనే కనిపిస్తున్నానని.. తనకొచ్చినన్ని నామినేషన్స్ ఎవరికీ రాలేదని అన్నారు. దానికి గీతూ ఒప్పుకోలేదు. రేవంత్ ఎప్పుడూ పడుకునే ఉంటున్నాడని కామెంట్ చేసింది. దీంతో మరోసారి రేవంత్ కి కోపమొచ్చి వెళ్లిపోయాడు.
ఇక హౌస్ మేట్స్ అందరూ కలిసి శ్రీహాన్, అర్జున్ కళ్యాణ్, కీర్తిలకు జీరో మినిట్స్ బోర్డ్స్ ఇచ్చారు. దానికి వారు ముగ్గురూ తెగ బాధపడిపోయారు. కీర్తి ఎప్పటిలానే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది. ఇక ఈ డ్రామాను మొత్తం ఈరోజు ఎపిసోడ్ లో చూసేయొచ్చు.
గురువారం ఎపిసోడ్ హైలెట్స్:
బిగ్ బాస్ పెట్టిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ‘అడవిలో ఆట’. ఇందులో పోలీస్ టీమ్ గెలిచింది. దీంతో పోలీస్ టీమ్ నుంచి ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు, దొంగల టీమ్ నుంచి శ్రీహాన్, అత్యాశ గల వ్యాపారిగా నటించిన గీతూ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. వీరికి మొదటి రౌండ్ లో భాగంగా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. బ్రిక్స్ ని పిరమిడ్‌లా కట్టి వాటిని కాపాడుకోవాలి. ఇందులో ఫైమా, గీతూ అవుట్ అయ్యారు. దీంతో శ్రీహాన్, ఆదిరెడ్డి,శ్రీసత్య రెండో రౌండ్ కు వెళ్లారు. ఈ టాస్క్‌కి రేవంత్ సంచాలక్ గా వ్యవహరించాడు.
అయితే శ్రీహాన్ బ్రిక్స్‌ని తాకాడంటూ కంప్లయింట్ ఇచ్చింది ఫైమా. దానికి ఇనయ నేను కూడా చూశానంటూ సాక్ష్యం చెప్పింది. దీంతో శ్రీహాన్ ‘ఏ పిట్ట వచ్చిన నీ దగ్గర ఏం కూసినా... సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్వు తీసుకో’ అన్నాడు రేవంత్‌తో. దాంతో ఇనయా ‘నన్ను పిట్ట అని ఎలా అంటావ్’ అంటూ గొడవ పెట్టుకుంది. మధ్యలోకి గీతూ అనవసరంగా వచ్చింది. ఆమెకు ఇనయ అంటే పడదు. నేను ఆ పిట్టని అంటూ వచ్చి పాటలు పాడింది. ఆమె ఈ ఇష్యూలో ఇన్వాల్స్ అవ్వాల్సిన అవసరం లేకున్నా కూడా అయ్యింది. ఈ గొడవ చాలా సేపు సాగింది. ఇనయా ముందురోజు ‘వీడు’ అంటే పడని శ్రీహాన్, ఇనయాను మాత్రం పిట్ట అనవచ్చా? అయినా సరే పిట్ట అంటే తప్పేంటి అంటూ కనిపించాడు శ్రీహాన్.
ఆమెకు చిప్ కరప్ట్ అయిపోయింది..
ఇక ఇనయా అంటే పడని వారంతా ఆదిరెడ్డి గీతూ ఒక చోట, నేహా - ఆర్జే సూర్య మరో చోట కూర్చుని ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆమెకు చిప్ కరప్ట్ అయిపోయింది అన్నాడు ఆర్జే సూర్య. ఇక గీతూ ‘శ్రీహాన్ ని మగాడివైతే’ అని ఇనయా అంది దానికి ఆమెకు క్లాస్ పడుతుంది అని చెప్పింది గీతూ. నిన్నటి ఎపిసోడ్‌లో పిట్ట గోల బాగా హైలైట్ అయింది.
Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?
Also Read : హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?