Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో పాము - ముంగిస ఎవరంటే... గీతూ - రేవంత్ పేరే చెబుతారు ఎవరైనా. ఇంట్లో రెండో రోజు నుంచి వారిద్దరూ ఒకరిమీద ఒకరు అరుచుకుంటూనే ఉన్నారు. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి ఆడితే ఎలా ఉంటుంది? అందులోనూ రేవంత్ తన టీమ్‌ను దొంగదెబ్బ తీసి గీతూతో కలిస్తే... ఆ ట్విస్ట్ మామూలుది కాదు. మిగతా ఇంటి సభ్యులు ఇది చూసి షాక్ తిన్నారు.
రేవంత్ మామూలోడు కాదు...
బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండెర్ టాస్కు ఇచ్చారు. ఇందులో గెలిచిన వారే కెప్టెన్సీ పోటీలో ఉంటారు. అడవిలో ఆట ఈ గేమ్‌కు పేరు పెట్టారు బిగ్‌బాస్.ఇందులో సగం మంది పోలీసులుగా, సగం మంది దొంగలుగా ఆడతారు. ఇక గీతూ ‘అత్యాశ గల వ్యాపారి’గా ఆడుతోంది. ఆమె దొంగల కొట్టేసిన సరుకును కొంటుంది. అయితే ఇందులో రేవంత్ దొంగల టీమ్‌లో ఉన్నాడు. గీతూ ఒక ఒప్పందానికి వచ్చారో ఏమో ప్రోమోలో చూపించలేదు కానీ రేవంత్ ఒక్కసారిగా గీతూ వైపు ఆడడం మొదలుపెట్టాడు. తాను దొంగిలించిన బొమ్మలన్నీ తీసుకెళ్లి గీతూకే ఇవ్వడం మొదలుపెట్టాడు. దొంగల టీమ్ లో ఉన్న చంటి, ఆరోహి, సూర్య, శ్రీహాన్ వీరంతా షాకయ్యారు.
ఇక గేమ్ మాత్రం చాలా హీట్ మీద సాగింది. పోలీసులు, దొంగల టీమ్ తామే గెలవాలని చాలా పథకాలు రచించారు. బాలాదిత్య అనుకోకుండా నేహాను దబ్బున కింద పడేశాడు. ఇక శ్రీహాన్ కెప్టెన్ రాజ్‌ను ఒక రేంజ్ లో కసిరిపడేశాడు.దీంతో పోలీసులు బొమ్మలన్నీ (సరుకు) మొత్తం కలిసి జైల్లో వేసి తాము కూడా జైల్లోనే కూర్చున్నారు. ఇక మిగతా సరుకును రేవంత్ తీసుకెళ్లి గీతూకి ఇచ్చేశాడు.
దీంతో చంటి, ఆదిరెడ్డి ఏంటి మీరిద్దరూ కలిసి ఆడుతున్నారా? అని అడిగారు. దానికి గీతూ ‘ఏం మేం కలిసి ఆడకూడదా?’ అంటూ స్టైల్లో స్పందించింది. ‘ఏమైనా కానీ తగ్గేదేలే’ అనుకుంటూ వెళ్లిపోయింది. ఈ టాస్కులో చివరికి ఏంజరిగిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాలి. ఇలా తన టీమ్ ని తానే వెన్నుపోటు పొడిచినందుకు వచ్చే వారం నామినేషన్ల వేడి రేవంత్ కి తగిలే అవకాశం ఉంది.
ఈ వారం నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నిలిచారు.
1. వాసంతి
2. ఆదిత్య
3. చంటి
4. ఆరోహి
5. నేహ
6. ఇనయా
7. శ్రీహాన్
8. రేవంత్
9. గీతూ
ఈ తొమ్మిది మందిలో బాగా వీక్ కంటెస్టెంట్ వాసంతి. ఆమె వెళ్లే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. ఆమె కాకపతే ఇనయాకు ఎసరు తప్పేలా లేదు.
Also read: ‘నోరు అదుపులో పెట్టుకో.. వాడు వీడు ఏంటి? లాగి కొడతా’ ఇనయాపై ఫైర్ అయిన రేవంత్, శ్రీహాన్