Bigg Boss 6 Telugu: ఇంట్లో తినడానికే వచ్చారా అంటూ శనివారం నాటి ఎపిసోడ్‌లో కొంతమందికి క్లాసు తీసుకున్నారు నాగార్జున.ఆ క్లాసు పనిచేసినట్టే కనిపిస్తుంది. ఎవరు నామినేట్ చేసినా ఓ నవ్వు నవ్వేసి ‘ఓకే’ అంటూ థమ్స్ అప్ చూపించేసే వాళ్లు కూడా ఈసారి నామినేషన్లలో కొట్లాడారు. ఎందుకో ఇనయాను ఎక్కువ మంది టార్గెట్ చేసినట్టు కనిపించారు. కానీ ఇనయ తన ఆట తాను మొదటి వారం నుంచే ఆడుతోంది.
సిల్లీ నామినేషన్లే...
శ్రీ సత్యా వచ్చిన మొదటి రోజు నుంచి ఆటపై పెద్దగా ఇష్టం లేనట్టుగానే కనిపించింది. నాగార్జున శనివారం నాటి ఎపిసోడ్ లో శ్రీసత్యను గట్టిగానే హెచ్చరించారు. కాగా నేటి ఎపిసోడ్ లో కూడా ఆమె కాస్త అలసత్వాన్నే చూపించింది. రంగు పూసి నామినేట్ చేయమన్నాడు బిగ్ బాస్. ఇనయాకు రంగు పూసింది శ్రీ సత్యా. దానికి ఇనయా ‘నీకు గేమ్ ఆడాలనే లేదు, కూర్చొని ముచ్చుట్లు చెప్పాలి, మాట్లాడాలనే వచ్చావ్’ అంది. దానికి శ్రీ సత్యా ‘ఇక్కడ ఎంత మంది గేమ్ ఆడారు’ అని ప్రశ్నించింది. దానికి ఇనయా ‘ఇది సిల్లీ నామినేషన్’ అంది. దానికి శ్రీ సత్యా ‘కొత్తగా చెప్పేదేముంది సిల్లీ నామినేషన్ అని’ అనుకుంటూ వెళ్లపోయింది. ఆమె ఉద్దేశం ఏంటో ఆమెకే తెలియాలి. నామినేషన్లను ఆమె సిల్లీగా తీసుకుంటోందా అనేదే అర్థం కాలేదు.
పళ్లెం ఎత్తేస్తా..
ఇనయాకే రంగు పూసి నామినేట్ చేశాడు ఆది రెడ్డి. దానికి ఇనయా ‘మీరు చాలా గేమ్ తెలుసుకుని వచ్చారు కాబట్టి’ అనే సరికి ఆదిరెడ్డి ఫైర్ అయిపోయాడు. అలా అనడం రాంగ్, బిగ్ బాస్ ఓపెన్ బుక్ అన్నాడు. కోపంగా ‘బిగ్ బాస్ పళ్లెం ఎత్తేస్తా’ అన్నాడు. ఇక గీతూని ఇనయా నామినేట్ చేసింది. ‘నువ్వు ఆడే తీరు నాకు నచ్చడం లేదు’ అది ఇనయా. దానికి గీతూ ‘నా ఆట ఎలా ఆడాలో నా చేతుల్లో ఉంటుంది’ అని ‘దొబ్బెయ్ ఇక్కడ్నించి దొబ్బెయ్’ అంటూ చికాకు పడింది.
సంస్కారం మీకుందా?
చంటి - గీతూ మధ్య మళ్లీ సంస్కారం గురించి గొడవ జరిగింది. వయసుకు తాను గౌరవం ఇవ్వనని చెప్పింది గీతూ. దానికి చంటి ‘మనం పది మందితో ఉన్నప్పుడు ఆ పదిమందితో సంస్కారంతో నడుచుకోవాలి’ అన్నాడు. దానికి గీతూ ‘ముందు నువ్వు కరెక్టుగా ఉన్నావో లేదో చూసుకో, తరువాత నాతో మాట్లాడు సంస్కారం గురించి, నాకు తీట కాదు అందరితో వాదించడానికి’ అంది. వీరిద్దరి గొడవ ఎంత వరకు సాగిందో ఎపిసోడ్లో చూడాలి.
సుదీప ఎమోషనల్...
సుదీపని గీతూ నామినేట్ చేసింది. కానీ ఏ కారణంతోనో తెలియదు. సుదీప ఆ విషయంలో చాలా ఎమోషనల్ అవుతూ ‘ఇది నా రక్తం, నా బేబీ, నాలో భాగం, నీకు ఆ ఎమోషన్ ఇంకా తెలియదనుకుంటున్నా’ అంటూ బాధపడుతూ కనిపించింది.
కాగా ఈ వారం నామినేషన్లో పదిమంది ఉన్నట్టు సమాచారం.
1. చంటి
2. ఆరోహి
3. గీతూ
4. రేవంత్
5. ఇనయా
6. వాసంతి
7. ఆదిత్య
8. సుదీప
9. నేహ
10. శ్రీహాన్
Also read: మూడేళ్ల నుంచి పుట్టనిది ఇప్పుడు పుడుతుందా - సూర్య గురించి ఆరోహి, ప్రేమ ఉందన్న అభినయ
Also read: అభినయశ్రీ ఎలిమినేషన్ - రేవంత్ కన్నింగ్ అంటూ కామెంట్స్, టాప్ 5లో ఆ ఇద్దరు!