Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లో వినిపించే గొంతులు రేవంత్, ఇనయా, గీతూ. వీళ్లే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈరోజు ఇనయాతో శ్రీహాన్, రేవంత్ ఇద్దరూ గొడవకు దిగారు. నేటి ఎపిసోడ్‌కు సంబంధించి విడుదలైన కొత్త ప్రోమోలో ఇనయా, రేవంత్, శ్రీహాన్ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. అసలేమైందంటే...
బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చారు. అడవిలో ఆట అని ఇచ్చి ఈ టాస్క్‌లో కొంతమంది ఇంటి సభ్యులు పోలీసులుగా, కొంతమంది దొంగలుగా వ్యవహరిస్తారు. ఇక గీతూ ‘అత్యాశ గల వ్యాపారి’గా ప్రవర్తిస్తుంది. ఆట ఏంటో పూర్తిగా తెలియదు కానీ పోలీసులుగా మెరీనా, రోహిత్, శ్రీ సత్య, ఇనయా, ఆదిరెడ్డి, చంటి, బాలాదిత్య వ్యవహరించారు. ఇక మిగతా వారంతా దొంగలు. ఈ ఆటలో దొంగలంతా వస్తువులు దాచేస్తూ కనిపించారు. వారిని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు.
వాడు లాగాడు...
కాగా ఆరోహి గేమ్‌లో గాయపడడంతో ఎత్తుకుని తీసుకెళ్లారు. ఇనయా ఆ విషయంపై అరస్తూ ‘నొప్పి అని స్ట్రాటజీలు యూజ్ చేసుకుని తీసుకెళ్లిపోతే...’ అనగానే శ్రీసత్య ‘ఆమెకు నిజంగానే కాలికి దెబ్బ ఉంది’ అని చెప్పింది. వెంటనే ఇనయా ‘ఉంది... ఆమెను లాగింది వాడు’ అని శ్రీహాన్ ను చూపించింది. అంతే శ్రీహాన్ కోపంగా ‘నోరు అదుపులో పెట్టుకో, వాడు వీడు ఏంటి’ అని గట్టిగా అరిచాడు. ఆ తరువాత రేవంత్ కూడా కలుగజేసుకున్నాడు. ‘మొన్న అన్నావ్ వాడు అని, లాగి కొడితే..’ అన్నాడు. దానికి ఇనయా ‘కొడతానని ఎలా అంటావ్, నన్ను కొడతానని ఎలా అంటావ్’ అంటూ ఇంట్లో హడావిడి చేసింది. దానికి రేవంత్ ‘వాడేంటి వాడు... ఎలా మాట్లాడాలో తెలియదా, మీ ఇంట్లో మ్యానర్స్ నేర్పలేదా’ అని అరిచాడు. మెరీనా, ఇనయాను ఇంట్లోంచి గార్డెన్ ఏరియాలోని తీసుకెళ్లిపోయింది. దీన్నిబట్టి ఈ రోజు ఎపిసోడ్‌లో గట్టిగానే గొడవ అయ్యేట్టు కనిపిస్తోంది.
వచ్చే వారం తప్పదు...
రేవంత్, శ్రీహాన్ ఈ ఘటనతో వచ్చే వారం ఇనయాను నామినేట్ చేసే అవకాశం అధికంగా ఉంది. అలాగే కొడతా అన్నందుకు రేవంత్ కూడా నామినేషన్లోకి వెళతాడు. నాగార్జున వీకెండ్ లో ఈ విషయం లేవనెత్తచ్చు కూడా. కాగా నిన్న వాడివేడిగా జరిగిన నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు.
ఈ వారం నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నిలిచారు.
1. వాసంతి
2. ఆదిత్య
3. చంటి
4. ఆరోహి
5. నేహ
6. ఇనయా
7. శ్రీహాన్
8. రేవంత్
9. గీతూ
వీరిలో బయటకు వెళ్లే అవకాశం వాసంతికే అధికంగా ఉంది. ఆమె ఈ వారం నోరు విప్పింది తప్ప గేమ్ అయితే ఇంతవరకు ఆడలేదు. అయితే బిగ్ బాస్ హౌస్ గ్లామర్ డాల్ అని మాత్రం పేరు తెచ్చుకుంది. ఇనాయ - వాసంతిలలో ఎవరో ఒకరు కచ్చితంగా బయటకు వెళ్లొచ్చు. వీరిద్దరే వీక్ కంటెస్టెంట్లు. మిగతా వారంతా స్ట్రాంగ్ గా ఉన్నారు.
Also read: బేబీ ఎమోషన్ నీకు తెలియదు అంటూ గీతూకి సుదీప క్లాస్, మరో నటరాజ్ మాస్టర్‌లా కనిపించిన ఆదిరెడ్డి, నామినేషన్లో అరుపులు