బిగ్ బాస్‌లో నామినేషన్లు మొదలైతే చాలు.. హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. పరస్పర ఆరోపణలతో మాటల యుద్ధం జరుగుతుంది. అయితే, ఆ మాటలు అదుపుతప్పితే పరిస్థితి ఎలా మారుతుందో చెప్పడానికి ప్రియానే నిదర్శనం. సోమవారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో ప్రియా.. లహరీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. లేట్ నైట్.. వాష్ రూమ్‌లో రవి, లహరి హగ్ చేసుకున్నారని నామినేషన్లు సందర్భంగా ఆరోపించింది. దీంతో ఒక్కసారిగా హౌస్‌లో వాతావరణం మారిపోయింది. నేషనల్ టెలివిజన్‌లో ఒకరి క్యారెక్టర్ దెబ్బతినేలా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ లహరి మండిపడింది. తనకు ఫ్యామిలీ ఉందని, ఇలాంటి వ్యాఖ్యల వల్ల బయటకు తప్పుడు మెసేజ్ వెళ్తుందని రవి అసహనం వ్యక్తం చేశాడు. 


వీరి వాదనలతోనే ఎపిసోడ్ మొత్తం నిండిపోయింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ సోమవారం ఎపిసోడ్‌తో పూర్తి కాలేదు. మంగళవారం కూడా నామినేషన్లు కొనసాగనున్నాయి. అయితే, ఈ రోజు (మంగళవారం) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ప్రియ, లహరి, రవి ఒక చోట కూర్చొని జరిగిన విషయం మీద చర్చించడం కనిపించింది. ఈ సందర్భంగా ‘సింగిల్ మెన్’, ‘మ్యారీడ్ మెన్’ వ్యాఖ్యల గురించి లహరి.. రవిని ప్రశ్నించింది. అయితే, తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రవి చెప్పడం కనిపించింది. ‘‘నువ్వు అన్నావ్’’ అని ప్రియా వాదించింది. తనను బ్యాడ్‌గా ప్రాజెక్ట్ చేయాలని ప్రియా చూస్తోందని రవి డైనింగ్ టేబుల్ వద్ద వ్యాఖ్యనించింది. ఎప్పుడూ కూల్‌గా కనిపించే ప్రియా.. ఈ గొడవ వల్ల డీలా పడినట్లు కనిపిస్తోంది. గార్డెన్ ఏరియాలో కూర్చొని తాను చూసిందే చెప్పానని, ఏదీ కల్పించి చెప్పలేదమ్మా అంటూ బాధపడటం కనిపించింది. 


బిగ్ బాస్ ప్రోమో:


సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో లహరి - ప్రియాను నామినేట్ చేస్తూ.. అసలు మీరెందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో.. నాకు అర్ధం కావట్లేదు' అని లహరి అనగా.. 'ఎందుకంటే నువ్ హౌస్ లో ఉన్న మగాళ్లతో నువ్ చాలా బిజీగా ఉంటున్నావ్' అని బదులిచ్చింది ప్రియా. 'ఎవరితోనో చెప్తారా..? ప్లీజ్' అని అడిగింది లహరి. దానికి ప్రియా.. 'రవి గారితో బిజీగా ఉన్నావ్.. మానస్ తో బిజీగా ఉన్నావ్..' అని ఆన్సర్ చేసింది. ఆ తరువాత 'నీకు మగాళ్లతో ఎలాంటి సమస్యలు రావని.. విమెన్ తో మాత్రమే సమస్యలుంటాయని' ప్రియా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తరువాత శ్రీరామచంద్రను నామినేట్ చేసింది. ఆ తర్వాత ప్రియా లహరీ, సన్నీలను నామినేట్ చేసింది. ఈ సందర్భంగా సన్నీ, లహరి, రవిల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నామినేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. చూస్తుంటే.. ఈ రోజు కూడా నామినేషన్ల ప్రక్రియ వాడి వేడిగా సాగేలా ఉంది. అలాగే ఈసారి శ్రీరామ చంద్ర నామినేషన్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరికంటే హమీదా, షన్నులు సేఫ్ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారో చూడండి. 


Also Read: అర్ధరాత్రి రెస్ట్ రూమ్‌లో లహరి, రవి హగ్.. ప్రియా కామెంట్స్‌తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్


శ్రీరామచంద్ర - మానస్ రవిని నామినేట్ చేశాడు.
సిరి - శ్వేతా, లహరిని నామినేట్ చేసింది. 
సన్నీ - ప్రియా, కాజల్‌ను నామినేట్ చేశాడు.
నటరాజ్ మాస్టర్ - సిరిని, కాజల్‌ను నామినేట్ చేశాడు.
యానీ మాస్టర్ - శ్రీరామచంద్ర, మానస్‌లను నామినేట్ చేసింది.
యాంకర్ రవి - శ్రీరామచంద్ర, జెస్సీ నామినేట్ చేశాడు. 
లోబో - ప్రియాంక, శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు.
ప్రియాంక - లోబో, జెస్సీను నామినేట్ చేసింది.
మానస్ - శ్రీరామచంద్ర, రవిని నామినేట్ చేశాడు. 


Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్, సామ్‌కు ఏమైంది?
Also Read: విశాల్ ఆ ఊపుడేంది? తెలుగు డబ్బింగ్‌పై ఫన్నీ వీడియో వదిలిన హీరో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి