`భీమ్లా నాయక్` అప్ డేట్ అనే మాట వింటే చాలు నెటిజన్లు ఫుల్ హుషారైపోతున్నారు. అది పోస్టర్ అయినా, ఫస్ట్ గ్లింప్స్  అయినా, సాంగ్స్ అయినా... పవన్-రానా అభిమానులు క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు.  భీమ్లా పాత్రలోకి పవన్, డేనియల్ పాత్రలో రానా నటిస్తుండగా  ఇప్పటికే ఆ ఇద్దరి లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. వీరిద్దరి మోషన్ పోస్టర్లు దూసుకెళ్లాయి. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో  చెప్పాల్సిన అవసరమే లేదు.  ఇక దీపావళి సందర్భంగా ఏం కానుక ఇస్తారో అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులకు మందు బాటిల్ తో  కిక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు పవర్ స్టార్. ఒకరోజు ముందుగానే దివాలీ కానుక అందించేందుకు సిద్ధమైంది మూవీ యూనిట్. 

భీమ్లా .. నుంచి స్పెషల్ వస్తోంది. ఈరోజు సాయంత్రం 7.02 గంటలకు వీడియో ప్రమోని విడుదల చేయనున్నామని మూవీ యూనిట్ ప్రకటించింది. ది సౌండ్ ఆఫ్ భీమ్లా హ్యాష్ ట్యాగ్ తో దీనిని వైరల్ చేస్తున్నారు. 'అయ్యప్పునుమ్ కోషియం' రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా  జనవరి12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఆరెంజ్ ఖద్దరు చొక్కా, గళ్ల లుంగీ కట్టుకుని బుద్ధిగా నేలపై కూచున్న పవన్... ఒక విస్కీ బాటిల్, చుట్టల్లా చుట్టి ఉన్న చిన్న చిన్న కట్టెల కట్టలు ముందు పెట్టుకున్నాడు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఓ రేంజ్ లో ఉంది బాసూ అంటున్నారు. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న 'భీమ్లా నాయక్'  టీమ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నాటికి మెజారిటీ పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు. పవన్ సరసన  నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇక సంక్రాంత్రి రష్ కారణంగా భీమ్లానాయక్ వాయిదా పడుతుందేమో అనే ప్రచారం జరిగినా..రిలీజ్ డేట్ మార్చేదే లేదని స్పష్టం చేసేశారు మేకర్స్. బరిలో దిగే పందెంకోడిని సిద్ధం చేస్తున్నట్టు అదిరిపోయే ప్రమోషన్ తో సితార టీమ్ దూసుకుపోతోంది. మరి తాజా వీడియో ప్రోమోతో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో వెయిట్ అండ్ సీ. ఫుల్ సాంగ్ మాత్రం త్రివిక్రమ్ పుట్టిన రోజు నవంబరు 7న  విడుదల చేయనున్నారని టాక్.Also Read:  'మేజర్' మూవీ రిలీజ్ డేట్ చెప్పిన మహేశ్ బాబుAlso Read: రవితేజ - వంశీ చిత్రం టైటిల్ వచ్చేసింది.. ఐదు భాషల్లో ఒకేసారి..Also Read:పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్Also Read:సన్నీ లియోనీ.. తగ్గేదే లే! ఆమె పేరుతో బ్లాక్‌చైన్‌తో రూపొందించే ఎన్‌ఎఫ్‌టీ.. ఇదో మరో రికార్డు!Also Read: సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్... శ్రీరామచంద్రకు టార్చర్Also Read: మానస్ ని సేవ్ చేసిన యానీ మాస్టర్.. ప్రియాంక ఫైర్..Also Read: 'అభిమానులు అనాలా..? ఆర్మీ అనాలా..?'.. 'ఆహా 2.0' ఈవెంట్ లో బన్నీ..Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి