పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో రానా మరో హీరో. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో సోమవారం జరగాల్సిన ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేపు (ఫిబ్రవరి 23) సాయంత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనునట్టు వెల్లడించారు. ముందుగా అనుకున్నట్టు హైదరాబాద్ సిటీలోని యూస‌ఫ్‌గూడాలో గల పోలీస్ గ్రౌండ్స్‌లోనే ఫంక్షన్ చేయనున్నారు.


'భీమ్లా నాయక్' సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే... హిందీ వెర్షన్ పనులు పూర్తి కాలేదని, పబ్లిసిటీకి టైమ్ లేని కారణంగా ఓ వారం తర్వాత విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ రిలీజ్ అయిన తెలుగు ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. రికార్డులు క్రియేట్ చేస్తోంది. మిలియన్ లైక్స్, 10 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది.


Also Read: వైసీపీతో త్రివిక్రమ్ ప్లాన్? అందుకే, 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్‌కు బండ్ల గణేష్ దూరమా? లీక్డ్ ఫోన్ కాల్‌లో నిజమెంత?






Also Read: గొడవ సెటిల్ అయిపోయినట్లేనా? బుక్ మై షోలో 'భీమ్లా నాయక్'


పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటిస్తున్న 'భీమ్లా నాయక్'ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా... త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. తమన్ సంగీతం అందించారు.