ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ వచ్చిన తరువాత దాదాపు అందరూ అందులోనే టికెట్స్ బుక్ చేసుకొని సినిమాలు చూస్తున్నారు. అయితే ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేయడం వలన ప్రేక్షకుడిపై చాలా భారం పడుతుందని.. ఆ భారం తగ్గించడానికే బుక్ మై షోపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. ఎగ్జిబిటర్లు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. బుక్ మై షోని ఎంకరేజ్ చేస్తే.. ఇప్పుడు అది దయ్యంలా తయారైందని ఓ టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బహిరంగంగానే కామెంట్స్ చేశారు.
'భీమ్లానాయక్' సినిమా టికెట్స్ ను ఆన్ లైన్ లో అమ్మే ప్రసక్తే లేదని అన్నారు. కానీ ఈరోజు వివాదం సెటిల్ అయినట్లుంది. బుక్ మై షోలో 'భీమ్లానాయక్' టికెట్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. పైగా పాత రేటే ఉంది. కన్వీనియెన్స్ ఫీ కూడా ఏం తగ్గించలేదు. అలాంటిది బుక్ మై షోని బ్యాన్ చేస్తామని.. 'భీమ్లానాయక్' సినిమాను బుక్ మై షోకి ఇవ్వమని మీడియా ముందు చెప్పడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు కొందరు.
కన్వీనియెన్స్ పేరుతో బుక్ మై షో వసూలు చేస్తోన్న మొత్తంలో కొంత భాగం ఎగ్జిబిటర్లకే వెళ్తుందని టాక్. కానీ ఆ పర్సంటేజ్ ని పెంచాలనే ఉద్దేశంతో ఎగ్జిబిటర్లు ఇలా బుక్ మై షోని బ్యాన్ చేస్తామని బెదిరించినట్లుగా ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. 'భీమ్లానాయక్' సినిమా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి బుక్ మై తము చెప్పినట్లుగా వింటుందని ఎగ్జిబిటర్లు భావించి ఉంటారు. ఫైనల్ గా.. 'భీమ్లానాయక్' సినిమా బుక్ మై షో యాప్ లో కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు గొడవ మొత్తం సద్దుమణిగిందని తెలుస్తోంది. ఆలస్యంగానైనా.. పవన్ సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఏపీలో మాత్రం ఇంకా బుక్ మై షో బుకింగ్స్ ఓపెన్ కాలేదు.