ఓ నటికి డైరెక్టర్ నుంచి సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దర్శకుడే కదా.. అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో అతడిని ఫ్రెండ్స్ లిస్టులో చేర్చుకుంది. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. రోజూ అతడు ఆమెకు అసభ్యకర మెసేజులు పెడుతూ ఆమె సహనానికి పరీక్ష పెట్టేవాడు. దీంతో అతడు ఎవరో తెలుసుకోడానికి ప్రయత్నించింది. అసలు విషయం తెలిసి ఆమె షాకైంది. 


పాయల్ సర్కార్ అనే బెంగాలీ నటికి ఎదురైన చేదు అనుభవం ఇది. సోషల్ మీడియాలో ప్రముఖ బెంగాలీ దర్శకుడు రవి కినాగి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో పాయల్ అతడి ప్రొఫెల్‌ చెక్ చేసింది. దర్శకుడి ఫొటోలు, పలు సినిమాల వివరాలు ఉండటంతో ఆమె వెంటనే రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది. అప్పటి నుంచి అతడు పాయల్‌తో చాట్ చేయడం మొదలుపెట్టాడు. తన సినిమాలో అవకాశం ఇస్తానని ఆశ చూపాడు.


 మొదట్లో బాగానే మాట్లాడిన అతడు క్రమేనా ఆమె వ్యక్తిగత విషయాలను ఆరా తీయడం, అసభ్యకర మెసేజులు పంపడం మొదలు పెట్టాడు. దర్శకుడు కదా.. కొన్ని రోజులు భరించింది. ఆ తర్వాత ఆమె సహనం నశించింది. వెంటనే అతడి చాటింగ్ హిస్టరీని స్క్రీన్ షాట్ తీసి ఫేస్‌బుక్‌లో తన స్నేహితులతో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె స్నేహితులు ఓ షాకింగ్ విషయం చెప్పారు. ఆ అకౌంట్ అసలు.. దర్శకుడు రవి కినాగిదే కాదని, నకిలీ అకౌంట్ అని చెప్పారు. దీంతో పాయల్ వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించింది. 


Also Read: అందాల విందుతో మతిపోగొడుతున్న విష్ణుప్రియ.. ‘ఆహా’లో ఛాన్స్.. ముద్దు సీన్లు కూడా!
 
బరక్‌పూర్‌ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని ఆ నకిలీ దర్శకుడి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళలతో అసభ్యకరంగా మాట్లాడే వ్యక్తులను శిక్షించాలని పాయల్ డిమాండ్ చేసింది. ఎవరో తన పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారనే విషయం తెలిసి దర్శకుడు రవి కినాగి షాకయ్యాడు. అతను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి వల్ల తన పరువు పోయిందని, వెంటనే అదుపులోకి తీసుకుని శిక్షించాలని రవి కోరాడు. ఎవరైనా అవకాశాలను ఎర వేస్తే.. వెంటనే ఆయా దర్శక నిర్మాతల ఆఫీస్‌కు ఫోన్ చేసి ఎంక్వైరీ చేయాలేగానీ.. సోషల్ మీడియాలో సంప్రదించడం మంచిది కాదని సూచించాడు.  


Also Read: వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?


Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?