'బాహుబలి' కంటే ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'ఛత్రపతి'. మదర్ సెంటిమెంట్, మాస్ కమర్షియల్ అంశాలు ఉన్న ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు 'ఛత్రపతి' హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ 'ఛత్రపతి'ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. హీరో, దర్శకుడు... ఇద్దరికీ తొలి హిందీ సినిమా ఇది. 'అల్లుడు శీను' సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన వి.వి. వినాయక్... 'ఛత్రపతి' రీమేక్‌తో అతడిని హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్ రాష్ట్రంలోని  భావ్ న‌గ‌ర్‌లో జరుగుతోంది. 'ఛత్రపతి'లో ప్రభాస్ బస్‌లో వెళ్లే సన్నివేశాలు ఉంటాయి కదా! అక్కడ ఓ ఫైట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఆ సన్నివేశాలను హిందీ సినిమా కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద భావ్ న‌గ‌ర్‌లో షూట్ చేశారు. షూటింగ్ కారణంగా పట్టణం అంతా సందడి సందడి నెలకొంది. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు జానీ లివర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ఛత్రపతి' సినిమాలో కథ విశాఖ నేపథ్యంలో సాగుతుంది. హిందీ రీమేక్ కోసం గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ జిల్లాను ఎంపిక చేసుకున్నట్టు ఉన్నారు. ఆ ఏరియా కూడా సముద్ర తీర ప్రాంతమే. 

బెల్లకొండ సాయి శ్రీనివాస్ నటించిన తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యాయి. అలా ఆయన ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయమే. ఉత్తరాదిలో ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'ఛత్రపతి'తో స్ట్రయిట్ హిందీ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ 'స్టూవ‌ర్ట్‌పురం దొంగ‌' చేయనున్నారు.

 

Also Read: డబ్బులు పోయినా పర్వాలేదు కానీ రాజీ పడకూడదని అనుకున్నాం! - నిత్యా మీనన్
Also Read: పెళ్లి తర్వాత బరువు పెరిగిన బుజ్జమ్మ! అంతకు ముందు ఎంత తగ్గింది? ఎందుకు తగ్గింది? అంటే...
Also Read: కావాలనే మమ్మల్ని పక్కన పెడుతున్నారా..? టికెట్ రేట్ ఇష్యూపై సురేష్ బాబు ఆవేదన..
Also Read: జైలులో ఎన్టీఆర్‌... ఎర్ర గాజులు... పిల్లలు... ప్రేక్షకులకు రాజమౌళి వదిలిన ప్రశ్నలు!
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి