Veera Simha Reddy Songs : శ్రుతీ హాసన్‌ - 'మాస్‌ మొగుడు' - బాలకృష్ణ

Mass Mogudu Song Veera Simha Reddy : బ్యూటిఫుల్ లేడీ శ్రుతీ హాసన్‌కు నట సింహం నందమూరి బాలకృష్ణ 'మాస్ మొగుడు'గా అలరించనున్నారు. 

Continues below advertisement

మాస్ మొగుడు... శ్రుతీ హాసన్‌ (Shruti Haasan) కు 'మాస్‌ మొగుడు'గా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అలరించనున్నారు. వీళ్ళు ఇద్దరు తొలిసారి జంటగా నటించిన సినిమా 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పుడు ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు. త్వరలో బాలయ్య, శృతిపై తెరకెక్కించిన పాట విడుదల చేయనున్నారు.
 
జనవరి 3న 'మాస్ మొగుడు'
బాలకృష్ణ, శ్రుతీ హాసన్ మీద 'వీర సింహా రెడ్డి' కోసం 'మాస్ మొగుడు...' అని ఓ పాటను తెరకెక్కించారు. జనవరి 3న... అనగా మంగళవారం రాత్రి 7 గంటల 55 నిమిషాలకు ఆ పాటను విడుదల చేయనున్నారు. సాంగ్ హుక్ లైన్ వింటే... ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రుతీ పెళ్ళి చేసుకోనున్నట్లు అర్థం అవుతుంది. మొదట ప్రేమలో పడినప్పుడు 'సుగుణ సుందరి...', పెళ్ళి అయిన తర్వాత 'మాస్ మొగుడు' సాంగ్స్ వస్తాయేమో!?

Continues below advertisement

ఇప్పటి 'వీర సింహా రెడ్డి'లో మూడు పాటలను విడుదల చేశారు. వాటిలో 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి...' హైలైట్ అని చెప్పాలి. నారి నారి నడుమ నందమూరి బాలయ్య డ్యాన్స్ చేస్తే? ఆ సాంగ్ సూపర్ హిట్టే! ఇప్పుడీ 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి...'లోనూ ఇరువురు భామలతో ఆయన డ్యాన్స్ చేశారు. ఎప్పటిలా హుషారుగా స్టెప్పులు వేశారు. ఆ ఇద్దరిలో ఒకరు సినిమాలో హీరోయిన్ హానీ రోజ్ కాగా... మరొకరు 'చీకటి గదిలో చితక్కొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి. సినిమాలో ఈ సాంగ్ చాలా  స్పెషల్‌గా ఉండబోతోందని, ప్రేక్షకుల చేత థియేటర్లలో స్టెప్పులు వేయించేలా ఉంటుందని యూనిట్ టాక్.

Also Read : సమంత - స్వర్గం - ఆ రెండు ప్రశ్నలు, 2022లో సమంత లాస్ట్ పోస్ట్!

దుమ్ము లేపుదాం! - తమన్
సంక్రాంతికి సినిమా చూడాలని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల్లో సంగీత దర్శకుడు తమన్ మరింత అంచనాలు పెంచేశారు. 'అఖండ' విజయంలో నేపథ్య సంగీతం ముఖ్య భూమిక పోషించింది. థియేటర్లలో జనాలను ఒక ట్రాన్స్‌లోకి తీసుకు వెళ్ళింది. అయితే, అమెరికాలో కొంత మంది సౌండ్ ఎక్కువైందని కంప్లైంట్స్ చేశారు. బహుశా... ఆ విషయం తమన్ మనసులో బలంగా ఉందనుకుంట!  ''కలుద్దాం... దుమ్ము లేపుదాం! జై బాలయ్య. ఈసారి థియేటర్స్... దయచేసి కంప్లైంట్స్ చేయకండి. ప్రిపేర్ అవ్వండి'' అని తమన్ ట్వీట్ చేశారు. అదీ సంగతి!

Also Read : 'కెజియఫ్'లో రాకీ భాయ్‌లా ఉన్నాడేంటి? రణ్‌బీర్‌ కపూర్‌ 'యానిమల్‌' ఫస్ట్‌ లుక్‌పై కామెంట్స్‌ 

బాలకృష్ణకు దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. లుక్స్ పరంగా మరింత కేర్ తీసుకుని, అభిమానులు కోరుకునే విధంగా చూపించారట. సాధారణంగా కమర్షియల్ సినిమాల రన్ టైమ్ రెండున్నర గంటల లోపు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడతారు. అంత కంటే ఎక్కువ ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో 'అఖండ' ఒకటి. ఆ సినిమా రన్ టైమ్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' రన్ టైమ్ కూడా అటు ఇటుగా అంతే ఉంటుందని సమాచారం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. 

హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Continues below advertisement