సమంత (Samantha) మోడ్రన్ అమ్మాయి. అయితే, ఆమెలో ఓ ఫిలాసఫర్ కూడా ఉన్నారు. అప్పుడప్పుడూ ఆమె మాటల్లో లోతైన భావం కనబడుతుంది. ఈ మధ్య అయితే మాటల్లో, చేతల్లో ఫిలాసఫీ ఎక్కువ వినబడుతోంది. సమంత చేసే సోషల్ మీడియా పోస్టులో, చెప్పే మాటలో మంచి ఉంటుంది. 


2022లో సమంత చేసిన లాస్ట్ పోస్ట్ ఏదో తెలుసా?
Samantha's 2022 Last Social Media Post : గత ఏడాది... 2022లో సమంత చేసిన లాస్ట్ పోస్ట్ ఏదో తెలుసా? ట్విట్టర్‌లో అయితే డిసెంబర్ 29న ఒక ఫోటో పోస్ట్ చేశారు. ''జీవితంలో ముందుకు వెళ్ళాలి. మనం ఏది కంట్రోల్ చేయగలమో... అదే చేయాలి. కొత్తగా, సులభంగా చేయగలిగిన నిర్ణయాలు తీసుకోవాలి. హ్యాపీ 2023'' అని పోస్ట్ చేశారు. 






మరి, ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత లాస్ట్ చేసిన పోస్ట్ ఏదో తెలుసా? ట్వీట్ చేసిన ఫోటో, క్యాప్షన్! కానీ, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో డిసెంబర్ 31న ఓ వీడియో షేర్ చేశారు. అది సద్గురు చెప్పిన మాటల్ని!


స్వర్గానికి వెళ్ళాలంటే?
''స్వర్గంలోకి వెళ్ళాలంటే... రెండు ప్రశ్నలు అడుగుతారు. ఒకటి... నువ్వు సంతోషంగా ఉన్నావా? రెండు... నీ చుట్టుపక్కల వాళ్ళను సంతోషంగా ఉంచావా? ఆ రెండిటికీ 'అవును' అని సమాధానం చెబితే నిన్ను లోపలికి పంపిస్తారు'' అని సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పిన వీడియో సమంత షేర్ చేశారు. 






గత ఏడాది సమంత జీవితంలో చాలా జరిగాయి. అక్టోబర్ 2021లో అక్కినేని నాగ చైతన్య, ఆమె విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత గత ఏడాది ఒంటరిగా ఉన్నారు. పైగా, మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు. ఒకానొక దశలో ఒక్కో అడుగు కూడా వేయడం కష్టమైందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సమంత సద్గురు వీడియో షేర్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. 


ఏది ఏమైనా సమంత సంతోషంగా ఉండాలని ఆమె అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు కోరుకుంటున్నారు. మళ్ళీ సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేయాలని ఆశిస్తున్నారు.


Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ - NTR 30 విడుదల ఎప్పుడో చెప్పేశారోచ్!
  
'శాకుంతలం' అప్‌డేట్‌ రెడీ
Samantha Upcoming Movie : గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం' (Shaakuntalam). రేపు... జనవరి 2న ఈ సినిమా అప్ డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. విడుదల తేదీ వెల్లడించే అవకాశాలు ఉన్నాయని టాక్. ఈ సినిమాలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు.





'ఖుషి' షూటింగ్ ఎప్పుడు?
'శాకుంతలం' చిత్రీకరణను సమంత ఎప్పుడో కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమా 'ఖుషి'. విజయ్ దేవరకొండకు జంటగా సమంత నటిస్తున్న చిత్రమిది. ఆమె అనారోగ్యం కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ మూడో వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, షూటింగ్ స్టార్ట్ కాలేదు. 


శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి 'ఖుషి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.



Also Read : 'కెజియఫ్'లో రాకీ భాయ్‌లా ఉన్నాడేంటి? రణ్‌బీర్‌ కపూర్‌ 'యానిమల్‌' ఫస్ట్‌ లుక్‌పై కామెంట్స్‌