Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'చెన్నకేశవ రెడ్డి' విడుదలై 20 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా సినిమాను రీ రిలీజ్ చేయగా... ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది.

Continues below advertisement

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ మొదలైంది. రీ రిలీజ్... రీ రిలీజ్... రీ రిలీజ్... ఇప్పుడు అగ్ర కథానాయకులు నటించిన క్లాసిక్ సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ మంచి జోరు మీద ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 'పోకిరి', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జల్సా' ఆల్రెడీ రీ రిలీజ్ అయ్యాయి. సూపర్ కలెక్షన్స్ సాధించాయి. ఇప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణ వంతు వచ్చింది.

Continues below advertisement

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా 'చెన్నకేశవ రెడ్డి' (Chennakesava Reddy). సెప్టెంబర్ 25వ తేదీకి ఈ సినిమా విడుదలై ఇరవై సంవత్సరాలు. ఈ సందర్భంగా రీ రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... అమెరికాలోనూ సినిమాకు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది.

అమెరికాలో సుమారు 40 లొకేషన్లలో 'చెన్నకేశవ రెడ్డి' విడుదల అయ్యింది. వందకు పైగా షోలు వేశారు. శనివారం (సెప్టెంబర్ 24వ తేదీ) రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి 'చెన్నకేశవ రెడ్డి' షోలు వేశారు. అమెరికాలో రికార్డు వసూళ్లు సాధించింది. ఇటీవల రీ రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జల్సా' కలెక్షన్స్‌ను బాలయ్య 'చెన్నకేశవ రెడ్డి' బ్రేక్ చేసింది. 

Chennakesava Reddy Re Release Collections USA : అమెరికాలో 'చెన్నకేశవ రెడ్డి' సినిమాకు 45,000 డాలర్లు వచ్చాయి. ఇది 36 లొకేషన్స్ కలెక్షన్స్ మాత్రమే. మరో రెండు లొకేషన్స్ కలెక్షన్స్ కూడా రిపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ ఉండవచ్చు. రీ రిలీజ్ సినిమాల్లో హయ్యస్ట్ రికార్డ్ ఇదే. పవన్ కళ్యాణ్ 'జల్సా'కు 38,000 డాలర్లు వచ్చాయి. మహేష్ బాబు 'పోకిరి'కి కేవలం 16,000 డాలర్లు వచ్చాయి. అదీ సంగతి!

''రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 300 థియేటర్లలో సినిమా విడుదల అయ్యింది.  సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం బాలకృష్ణగారి బసవతారకం ట్రస్ట్, మిగతాది నా అసోషియేషన్స్‌కు ఇవ్వాలని నిర్ణయించాం. కమర్షియల్‌గా కాకుండా మంచి ఉద్దేశం కోసం ఈ సినిమాను రీ రిలీజ్ చేశాం'' అని చిత్ర నిర్మాత బెల్లకొండ సురేష్ తెలిపారు. 

Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

బాలకృష్ణకు అమెరికాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన లేటెస్ట్ హిట్ సినిమా 'అఖండ' అమెరికాలో మిలియన్ డాలర్ మార్క్ చేరుకుంది. ఇప్పుడు 'చెన్నకేశవ రెడ్డి' రీ రిలీజ్ కలెక్షన్స్‌తో మరోసారి నట సింహం క్రేజ్ ప్రూవ్ అయ్యింది.
 
సినిమాలకు వస్తే... ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా (NBK 107) చేస్తున్నారు. శ్రుతీ హాసన్ కథానాయికగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న చిత్రమిది. ఇటీవల టర్కీలో షూటింగ్ చేశారు. ఇది కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా (NBK 108) బాలకృష్ణ అంగీకరించిన సంగతి తెలిసిందే. 

Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ

Continues below advertisement
Sponsored Links by Taboola