రైలు ప్రయాణికుల రద్దీ మేరకు ఎంపిక చేసిన మార్గాల్లో నిర్దేశిత తేదీల్లో స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సెస్టెంబర్‌ 25, 26, 27, 28 తేదీల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి మొత్తం 6 స్పెషల్ రైలు సర్వీసులను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబరు 25న సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు (07469), 26న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు స్పెషల్ రైలు (07470), 25, 27 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి యశ్వంత్‌పూర్‌కు ప్రత్యేక రైలు సర్వీసు (07233), 26, 28 తేదీల్లో యశ్వంత్‌పూర్‌-హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు (07234), 26న నాందేడ్‌ నుంచి ఒడిశాలోని పూరీకి ప్రత్యేక రైలు (07565), 27న పూరీ నుంచి నాందేడ్‌కు ప్రత్యేక రైలు(07566) నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 






అదే సమయంలో రైల్వే అధికారులు ఈ నెల 25న వివిధ ప్రాంతాల నుంచి నడిచే తొమ్మిది రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు. విజయవాడ -గుంటూరు (07783), గుంటూరు - మాచర్ల (07779), మాచర్ల - నడికుడి (07580), నడికుడి - మాచర్ల (07579), మాచర్ల -విజయవాడ (07782), డోర్నకల్‌ - విజయవాడ (07755), విజయవాడ - డోర్నకల్‌ (07756), భద్రాచలం - విజయవాడ (07278), విజయవాడ - భద్రాచలం (07979) రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ట్విటర్ లో ఉంచారు.


ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు
రైల్వే ట్రాక్ సహా ఇతర మరమ్మతుల కారణంగా ఈ నెల 25వ తేదీన కొన్ని మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి - హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి, ఫలక్‌నుమా - లింగంపల్లి, లింగంపల్లి - ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌ - లింగంపల్లి, లింగంపల్లి - సికింద్రాబాద్‌ మార్గాల్లో కొన్ని సర్వీసులు రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.






ఈ స్టేషన్లలో తాత్కాలిక స్టాప్‌లకు అనుమతి
షాద్ నగర్ సమీపంలోని చేగూర్ లో సహజ్ మార్గ్ స్పిరిచువల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నందున దానికి హాజరయ్యే వారి సౌకర్యార్థం షాద్ నగర్/ తిమ్మాపూర్, వికారాబాద్ స్టేషన్లలో కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఆగేందుకు అనుమతించనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 


షాద్ నగర్ స్టేషన్‌లో ఆగే ఎక్స్‌ప్రెస్ రైళ్లు (తాత్కాలికంగా) 
17651 - చెంగల్ పట్టు - కాచిగూడ (సెప్టెంబరు 24, 25, 26)
17604 - యలహంక - కాచిగూడ (సెప్టెంబరు 24, 25, 26)
17652 - కాచిగూడ - చెంగల్ పట్టు (సెప్టెంబరు 29, 30)


వికారాబాద్ స్టేషన్‌లో ఆగే ఎక్స్‌ప్రెస్ రైళ్లు (తాత్కాలికంగా)
11019 - సీఎస్టీ ముంబయి - భువనేశ్వర్ (సెప్టెంబరు 24, 25, 26)
22717 - రాజ్ గోట్ - సికింద్రాబాద్ (సెప్టెంబరు 26)
11020 - భువనేశ్వర్ - సీఎస్టీ ముంబయి (సెప్టెంబరు 29, 30)
22718 - సికింద్రాబాద్ - రాజ్ కోట్ (సెప్టెంబరు 29, 30)