'అవతార్ 2' (Avatar The Way Of Water Movie) ఎప్పుడు చూద్దామా? అని ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందుకు భారతీయ ప్రేక్షకులు ఏమీ అతీతం కాదు. ఇండియాలో ఇంకా జేమ్స్ కామరూన్ సృష్టించిన విజువల్ వండర్ విడుదల కాలేదు. 


ముంబైలో హిందీ చలన చిత్ర పరిశ్రమలో కొందరు తారలకు మాత్రమే ప్రత్యేకంగా ప్రీమియర్ షో వేశారు. వాళ్ళు అందరూ సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. దాంతో సామాన్య ప్రేక్షకులలో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. కొంత మంది నెట్టింట ప్రింట్ డౌన్ లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. 


ఆన్‌లైన్‌లో 'అవతార్ 2' ఫ్రీ షోస్
ఇండియాలోని థియేటర్లలో 'అవతార్ 2' విడుదలకు ముందు సినిమా ప్రింట్ ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. పైరసీ ప్రింట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫ్రీగా సినిమా అందుబాటులో ఉండటంతో కొందరు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. అంతే కాదు, తమ స్నేహితులకు కూడా పైరసీ ప్రింట్ ఇస్తున్నట్లు సమాచారం.
 
థియేటర్లలో చూస్తేనే మజా
'అవతార్ 2' పైరసీ కావడంతో సినిమా ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా సినిమాలను థియేటర్లలో, భారీ తెరపై చూస్తేనే మజా ఉంటుందని మరీ నొక్కి చెబుతున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఈ విధంగా పైరసీ చేయడం భావ్యం కాదని అంటున్నారు. 


పైరసీలో 'అవతార్' రికార్డ్
'అవతార్ 2' మాత్రమే కాదు... దీనికి ముందు వచ్చిన 'అవతార్' కూడా పైరసీ బారిన పడింది. ఎక్కువసార్లు పైరసీకి గురైన సినిమా రికార్డు ఆ సినిమా పేరిట ఉంది. కానీ, అది ఏమంత ప్రభావం చూపించలేదు. అప్పట్లో 'అవతార్' వసూళ్ళ రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు 'అవతార్ 2' విడుదలకు ముండే పైరసీ కావడం కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. 


నెగిటివ్ రివ్యూలు రావడం మైనస్ అవుతుందా?
పైరసీకి తోడు నెగిటివ్ రివ్యూలు రావడం 'అవతార్ 2'కు మైనస్ అవుతుందా? అనే చర్చ ట్రేడ్ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే... ఆల్రెడీ లండన్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రస్తుతం ప్రేక్షకుల్లో నెలకొన్న హైప్‌కు తగ్గట్టు సినిమా లేదని చూసిన వాళ్ళు చెబుతున్నారు.


Also Read : 'జగమే మాయ' రివ్యూ : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ధన్యా బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?


ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 16న సినిమా విడుదల అవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రేక్షకుల్లో కూడా  సినిమాపై మంచి బజ్ బావుంది. తెలుగు మార్కెట్ మీద హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం తెలుగు బాగా తెలిసిన రచయిత, దర్శకుడు, కథానాయకుడికి మాటలు రాసే బాధ్యత అప్పగించారు.


అవసరాల మాటల్లో 'అవతార్ 2'
అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) కథానాయకుడు మాత్రమే కాదు... హీరో కంటే ముందు ఆయనలో రచయిత ఉన్నాడు. తెలుగు భాషా ప్రేమికుడు ఉన్నాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తే చాలు... అవసరాల తెలుగు ఎంత స్పష్టంగా, డైలాగులు ఎంత సూటిగా ఉంటాయో ఉంటుందో తెలుస్తుంది. అందుకే, ఆయన చేత 'అవతార్ 2'కి డైలాగులు రాయించినట్టు ఉన్నారు.