Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ఆరుగురు మిగిలారు. ఆ ఆరుగురిలో ఒకరు ఈరోజు ఎలిమినేట్ అవుతారు. ఇంకా అయిదుగురు మిగులుతారు. ఆ అయిదుగురిలో ఒకరు విన్నర్. కాగా ఈరోజు ఇంట్లో చివరి టాస్కు ఇచ్చారు. దీనికి ‘బిగ్‌బాస్ ఇంట్లో ఆఖరి పోరాటం’ అనే ఆట ఇచ్చారు. ఇందులో వచ్చే శబ్ధాలను గుర్తుపెట్టి వాటిని వరుసగా రాయాలి. ఎవరైతే ఎక్కువ శాతం సరిగ్గా రాస్తారో వారికి ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం వస్తుంది. ఇందులో రకరకాల శబ్ధాలు వినిపించారు బిగ్ బాస్. అయితే ఆ శబ్దాలు వస్తున్నప్పుడు రేవంత్ రాయడం మొదలుపెట్టాడు. దీంతో అతడిని రాయకూడదని చెప్పింది శ్రీసత్య. మధ్యలో శ్రీహాన్ కలుగుజేసుకుని మధ్యల నువ్వెందుకు మాట్లాడుతున్నావ్, బిగ్ బాస్ చూసుకుంటారు కదా అన్నారు. చివరికి ఏమైందో కానీ ఆదిరెడ్డి,రోహిత్ లకు అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. 


ఇద్దరిలో ఒక్కరే...
ఆదిరెడ్డి, రోహిత్‌లలో ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం ఒకరికే వస్తుందని, అది ఎవరో ఇంటి సభ్యులే నిర్ణయించాలని చెప్పారు. దీంతో రేవంత్ ఆదిరెడ్డిక సపోర్ట్ చేయగా, శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి రోహిత్‌కు సపోర్ట్ చేశారు. దీంతో ఓట్లు అడిగే అవకాశాన్ని రోహిత్ దక్కించుకున్నాడు. 


గొడవ...
శ్రీసత్య మధ్యలో మాట్లాడడం వల్లే తాను ఓడిపోయానంటూ శ్రీహాన్ కామెంట్ చేశాడు. దీంతో శ్రీసత్య ఆ సమయంలో వచ్చినవి కాకుండా,  మిగతా సమయంలో వచ్చిన శబ్ధాలను సరిగ్గా రాయచ్చు కదా అంది. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. ఇంకా నాలుగు రోజులే ఫినాలే ఉన్నా కూడా వీరిద్దరూ గొడవ పడ్డారు. 



శ్రీసత్య అవుట్?
ఇంట్లో ఉన్న వారిలో నెగిటివిటీ మూటకట్టుకున్న అమ్మాయి శ్రీసత్య. ఇనాయను, కీర్తిని ఆమె వ్యక్తిగతంగా దాడి చేసి బాధపడేలా చేసింది. ముఖ్యంగా ఫిజికల్ గా వెక్కిరించడం, అర్జున్ కళ్యాణ్‌ను ఆట కోసం వాడుకోవడం కూడా చాలా చికాకు పుట్టించింది. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో శ్రీసత్య, ఆదిరెడ్డి ఓటింగ్ లో కింద ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వారందరికీ వీరి కన్నా ఎక్కువగానే ఓటింగ్ వచ్చిందని సమాచారం. ఆదిరెడ్డికి అంత నెగిటివిటీ లేదు, అందుకే ఆయన్ను ఉంచి శ్రీసత్యను ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. 


బిగ్ బాస్ 6 విజేత అయ్యే అవకాశం రేవంత్‌కే ఉందని ఎక్కువమంది భావిస్తున్నారు. కానీ మధ్యలో రోహిత్ పేరు కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా చివరి నాలుగువారాలుగా రోహిత్ గ్రాఫ్ కూడా పెరిగింది. దీనికి కారణం రోహిత్ బాగా ఆడినా కూడా ఉడుకుమోతుతనం, కోపం, ప్రతి దానికి గొడవలు పడడం, ఓటమిని తీసుకోలేకపోవడం, చీటికి మాటికి అరవడం ఇవన్నీ ప్రేక్షకులకు చిరాకును కలిగిస్తున్నాయి. ఇక రోహిత్ నిదానంగా ఆడుతున్నాడు. భావోద్వేగాల విషయంల్ చాలా కంట్రోల్ గా ఉంటున్నాడు. ఎవరినీ ఇంతవరకు బాధపెట్టలేదు.రేవంత్‌లా బట్టలు చించుకుని ఆడడం లేదు కానీ, ఉన్నంతలో తన నేచర్‌ను బట్టి బాగానే ఆడుతున్నాడు. బిగ్ బాష్ అనేది వ్యక్తిత్వానికి సంబంధించిన ఆట. ఇందులో గెలవాలంటే ఫిజికల్ టాస్కులు గెలిస్తే సరిపోదు, ఎదురయ్యే పరిస్థితులను తట్టుకుని నిలబడాలి. ఇలా చూసుకుంటే రోహిత్, రేవంత్ కన్నా చాలా బెటర్ అనిపిస్తాడు. 


Also read: మిడ్‌వీక్ ఎలిమినేట్ అయిన శ్రీసత్య? - ఇన్నాళ్లు ఉండడమే ఎక్కువ అంటూ నెటిజన్ల కామెంట్లు