Ashish Vidyarthi 2nd Marriage: అనేక బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో ప్రతినాయక పాత్రలు పోషించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయస్సులో రెండో వివాహం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బరువాతో ఆశిష్ విద్యార్థి ఏడు అడుగులు వేశారు.


వైరల్‌గా మారిన ఫొటో
ఆశిష్ విద్యార్థి, రూపాలి బరువా మే 25వ తేదీన తమ సన్నిహితుల సమక్షంలో కోర్టులో వివాహం చేసుకున్నారు. వీరి ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో వీరిద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు.


కోల్‌కతాలో ఆశిష్, రూపాలి వివాహం
ఆశిష్ విద్యార్థి, రూపాలి బరువా కోల్‌కతాలో వివాహం చేసుకున్నారు. రూపాలి ఫ్యాషన్ పరిశ్రమకు చెందిన వ్యక్తి. కోల్‌కతాలో వీరికి ఫ్యాషన్ స్టోర్ కూడా ఉందని తెలుస్తోంది. అందుకేనేమో పెళ్లి దుస్తులు కూడా అందంగా డిజైన్ చేసుకున్నారు. ఈ ఫొటోల్లో ఆశిష్ ఆఫ్ వైట్ కుర్తాను ధరించారు. మరోవైపు రూపాలి బరువా కూడా వైట్ షేడ్ చీరలో చాలా అందంగా ఉంది. ఫోటోల్లో ఇద్దరూ తమ మెడలో దండలు ధరించి కెమెరాకు పోజులిచ్చారు.


ఆశిష్‌కు రెండో వివాహం
రూపాలి బరువా కంటే ముందే ఆశిష్ నటి రాజోషి విద్యార్థిని వివాహం చేసుకున్నారు. రాజోషి నటి, గాయని, థియేటర్ ఆర్టిస్ట్. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో ఆశిష్ విద్యార్థి రెండో విద్యార్థి రెండో వివాహం చేసుకున్నాడు.


ఇక సినిమాల విషయానికి వస్తే... ఆశిష్ విద్యార్థి తెలుగులో చివరిగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాలో కనిపించారు. ఆయన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో కూడా ఆశిష్ నటించారు. దీంతోపాటు హిందీ సినిమా ‘ఖుఫియా’లో కూడా నటించారు. ఈ సినిమా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. మొత్తం 11 భాషల్లో 200కు పైగా చిత్రాల్లో ఆశిష్ విద్యార్థి నటించారు.