Raghunandan Rao : ఓఆర్ఆర్ టెండర్లపై సీబీఐకి ఫిర్యాదు చేసినట్లుగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటించారు. టెండర్ల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సీబీఐ దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు రఘునందన్ రావు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టెండర్ దక్కించుకున్న ఐఆర్బి సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ అంశంపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. ORR కోసం ఓ కార్పోరేషన్ ను పెట్టాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదన్న రఘునందన్ రావు
టెండర్ దక్కించుకున్న IRB సంస్థపై ఆరోపణలున్నాయన్నారు. లక్షకోట్ల ఆదాయం వచ్చే టెండర్లపై ఎందుకు మాట్లడటం లేదని నిలదీశారు. టెండర్ల విషయంలో ఇన్ని మోసాలు జరుగుతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. IRB ఎక్కడిది, IRB సంస్థ ఎవరిది, ఇంత మోసం జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించడం లేదని నిలదీశారు. ORR టోల్ గేట్ పై సమీక్ష చేయడానికి సీఎం కేసీఆర్ కు టైం లేదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ORR టెండర్ల విషయంలో HMDA అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. IRB సంస్థకు ఎందుకు వెసులుబాటు ఇస్తున్నారని.. టెండర్లు విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే CBI దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.
ఔంటర్ రింగ్ రోడ్ టెండర్లపై రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు
కవిత, కేటీఆర్ స్నేహితుల కంపెనీకి ఓఆర్ఆర్ ను లీజుకు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్ ను ఈ ఏడాది ఏప్రిల్ 11న తెరిచినట్టుగా రఘునందన్ రావు చెప్పారు. కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని రఘునందన్ రావు గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని రఘునందన్ రావు ప్రశ్నించారు. అంతేకాదు కంపెనీ దాఖలు చేసిన బిడ్ కంటే ఈ 16 రోజుల్లో బిడ్ అమౌంట్ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. దీని వెనుకే ఏదో మతలబు జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటున్న రఘునందన్ రావు
ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న కంపెనీ రూ.7272 కోట్లు కోట్ చేసినట్టుగా రఘునందన్ రావు చెప్పారు. కానీ రూ.7,380 కోట్లుగా అరవింద్ కుమార్ ఎలా ప్రకటించారని రఘునందన్ రావు ప్రశ్నించారు .టెండర్ల ప్రక్రియ పూర్తైన తర్వాత కంపెనీ బిడ్ దాఖలు చేసిన అమౌంట్ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. ఈ డబ్బు ఎవరిని అడిగి పెంచారని ఆయన ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్ ఫైనల్ చేసిన ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు అరవింద్ కుమార్ ఫోన్ ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ డేటాను ప్రభుత్వం బయటపెట్టగలదా అని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 27 వరకు అరవింద్ కుమార్ హైద్రాబాద్ లోనే ఉన్నాడా ఇంకా ఎక్కడికైనా వెళ్లాడా ... ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తే వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి ఇవ్వాలి కదా అని రఘునందన్ రావు అంటున్నారు. పలు అంశాలపై ప్రభుత్వం స్పందించాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు.