డ్రగ్స్ కోసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు కావడంతో షారుక్ ఖాన్ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది. ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. అయితే పూర్తి బెయిల్ ఆర్డర్‌ను ఈరోజు విడుదల చేసింది. దీనిని ఆర్యన్ ఖాన్ ఉన్న ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైలుకు పంపింది. అయితే ఆర్యన్ ఖాన్‌ ఈరోజు రిలీజ్ అవుతాడని అంతా భావించారు. షారుక్ ఖాన్ కుడా ప్రత్యేక కాన్వాయ్‌లో జైలుకు వెళ్లారు. కానీ జైలు అధికారులు మాత్రం ఆర్యన్‌ను రేపే విడుదల చేస్తామని తెలిపారు.






రిలీజ్ ఆర్డర్ కాపీ.. ఆర్థర్ రోడ్ జైలు బయట అంటించాల్సి ఉందని.. అయితే ఈరోజు సాయంత్రం 5.35 నిమిషాల వరకు దీని కోసం తాము వేచిచూసినట్లు జైలు అధికారులు తెలిపారు. కనుక ఆర్యన్ రేపే విడుదల కానున్నారు.


ఇవే షరతులు.. 



  • 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్‌ రూ.లక్ష వ్యక్తిగత బాండ్ చెల్లించాలి.

  • ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలి.

  • ఎన్‌డీపీఎస్ కోర్టు వద్ద పాస్‌పోర్టును సరెండర్ చేయాలి.

  • గ్రేటర్ ముంబయి దాటి వెళ్లాలంటే దర్యాప్తు అధికారికి తెలపాలి. ఎక్కడికి వెళ్తున్నారో వివరాలను కూడా తెలియజేయాలి.

  • ముంబయిలోని ఎన్‌డీపీఎస్ ప్రత్యేక కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లకూడదు.

  • ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎవరితోనూ మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు.

  • ఈ కేసులో సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేయకూడదు.

  • ఈ కేసు గురించిన వివరాలు మీడియాకు చెప్పకూడదు.

  • ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య హాజరు కావాలి.

  • ఎన్‌సీబీ అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలి.


వీటిలో ఏవైనా షరతులను ఆర్యన్ ఖాన్ ఉల్లంఘించినట్లు ఎన్‌సీబీ భావిస్తే బెయిల్ రద్దు కోసం కోర్టును కోరవచ్చు.


ఇదీ కేసు..


ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. 


ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు. 


విచారణలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది. ఎట్టకేలకు బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది.


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 14,348 కరోనా కేసులు, 805 మరణాలు నమోదు


Also Read: WHO ON Covaxin: భారత్ టీకాలు భేష్.. కొవాగ్జిన్‌కు త్వరలోనే అనుమతి: డబ్ల్యూహెచ్ఓ


Also Read: G20 Summit 2021: రోమ్ చేరుకున్న ప్రధాని.. జీ20, కాప్- 26 సదస్సులతో మోదీ బిజీ


Also read:  అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే