టాలీవుడ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth), దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ప్రేక్షకుల ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర, ద్వారకా నగరం మీద అన్వేషణ చేసే వైద్యుడిగా నిఖిల్ కనిపించనున్నారు.
ముందుగా ఈ సినిమాను జూలై 22న రిలీజ్ చేయాలనుకున్నారు. ఫైనల్ గా ఆగస్టు 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. దానికి తగ్గట్లు ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా హీరోయిన్ అనుపమ కనిపించడం లేదు. దీనిపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు.. డే అండ్ నైట్ షూటింగ్ లో బిజీగా ఉంటున్నట్లు చెప్పింది అనుపమ.
ఇతర ఆర్టిస్ట్ లతో కలిసి కాంబినేషన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారని.. వారి డేట్స్, తన డేట్స్ కలిపి సెట్ చేయడానికి చాలా సమయమే పట్టిందని.. మరోపక్క 'కార్తికేయ2' రిలీజ్ డేట్స్ మారుతూ వచ్చాయని.. ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్స్ లో పాల్గొనడం కష్టంగా మారిందని క్లారిటీ ఇచ్చింది. అందరూ అర్ధం చేసుకుంటారని నమ్ముతున్నట్లు.. తన టీమ్ కి, హీరో నిఖిల్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది.
ఇక 'కార్తికేయ 2' సినిమా విషయానికొస్తే.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Also Read: ‘అబ్బా అబ్బా’ సాంగ్.. సుధీర్, దీపిక పిల్లి రొమాన్స్ - రాఘవేంద్రరావు పాటంటే ఆ మాత్రం ఉండాలి