Animal Movie Review Twitter Telugu: 'యానిమల్' థియేటర్లలో విడుదలైంది. ఈ రోజు (శుక్రవారం, డిసెంబర్ 1న) ప్రపంచవ్యాప్తంగా షోస్ పడ్డాయి. అయితే... ఒక్క రోజు (గురువారం, నవంబర్ 30న) ముందు ముంబైలో సెలబ్రిటీలతో పాటు కొంత మంది మీడియా ప్రతినిధుల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అమెరికాలో ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. మరి, సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందో చూద్దామా?


అదరగొట్టిన రణబీర్ కపూర్!
'యానిమల్' హైలైట్స్ చూస్తే... హీరో రణబీర్ కపూర్ యాక్టింగ్ ముందు వరుసలో ఉంటుందని ఆల్రెడీ సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. యాక్షన్ సీన్లలో ఆయన ఇంటెన్స్ చూపించారట. 'వేకప్ సిద్', 'తమాషా', 'రాక్ స్టార్', 'బర్ఫీ', 'ఏ జవానీ హై దివాని', 'ఏ దిల్ హై ముష్కిల్' తదితర సినిమాల్లో ఆయన నటనకు విమర్శకుల నుంచి సామాన్యుల వరకు ప్రశంసలు లభించాయి. అయితే... ఈ 'యానిమల్'లో కొత్త రణబీర్ కపూర్ కనిపిస్తారని జనాలు అంటున్నారు.


Also Read: దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?


తండ్రీ కుమారుల మధ్య సన్నివేశాలు గానీ, హై వోల్టేజ్ ఇంటెన్స్ యాక్షన్ గానీ, రష్మికతో లవ్ సీన్లలో గానీ రణబీర్ కపూర్ జీవించారట. హిందీ నుంచి ఆయన నటనకు మంచి రివ్యూలు వస్తున్నాయి. మరి, మన తెలుగు ప్రేక్షకులు ఏం చెబుతారో చూడాలి. రణబీర్ కపూర్ సరసన నటించిన రష్మికా మందన్నా సైతం చక్కగా నటించారని ప్రశంసిస్తున్నారు. 


'యానిమల్' మొదటి సీన్ నుంచి...
థియేటర్లలో 'యానిమల్' సినిమా మొదలైన మరుక్షణం నుంచి ఆడియన్స్ అటెన్షన్ తన వైపు తిప్పుకోవడం ఖాయమని ఓవర్సీస్ రివ్యూ రైటర్లు ట్వీట్ చేశారు. రణబీర్ కపూర్ ఓపెనింగ్ సీక్వెన్స్ సూపర్ వచ్చిందట. సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన ఫిల్మ్ మేకింగ్ స్టైల్, దర్శకత్వంతో ఆకట్టుకుంటారని చెబుతున్నారు. అయితే... సినిమా విడుదలకు ముందు రన్ టైమ్ గురించి ఎక్కువ డిస్కషన్ నడిచింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో దాని గురించి ఎవరూ ప్రస్తావించడం లేదు. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply


ట్విట్టర్ అంతా 4 స్టార్ రేటింగ్స్!
'యానిమల్' చూసిన బాలీవుడ్ క్రిటిక్స్ ఇంకా రేటింగ్ ఇవ్వలేదు. అయితే... సోషల్ మీడియాలో సినిమాకు ఫోర్ స్టార్ రేటింగ్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి ట్విట్టర్ లో ఈ సినిమా గురించి చేసిన పోస్టులు చూడండి. 






















Also Readది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ: ఆర్య & మిళింద్ రావు థ్రిల్ ఇచ్చారా? భయపెట్టారా?