Animal movie pre release business: 'యానిమల్' కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం 'అర్జున్ రెడ్డి'. రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండను స్టార్ చేసిన సినిమా అది. సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయమైన సినిమా అది. 'అర్జున్ రెడ్డి' తర్వాత ఆ కథను హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేశారు. ఇప్పుడు కొత్త కథతో 'యానిమల్' తీశారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి.


'యానిమల్' బడ్జెట్ ఎంత?
Animal Movie Budget: తండ్రీ కుమారుల మధ్య అనుబంధం, ప్రేమ, ప్రతీకారం అంశాల నేపథ్యంలో 'యానిమల్' సినిమా తెరకెక్కింది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటించారు. ఆయనకు జోడీగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా, తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కనిపించనున్నారు. ఈ సినిమాను 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించినట్లు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ రెడ్డి వంగా చెప్పారు. పబ్లిసిటీ, ఇతరత్రా ఖర్చులతో చూస్తే 250 కోట్ల వరకు బడ్జెట్ అయ్యి ఉంటుందని ఓ అంచనా.


తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎలా జరిగింది?
Animal Pre Release Business in Telugu states: టీ సిరీస్ సంస్థ తమ సినిమాలను సొంతంగా విడుదల చేస్తుంది. నార్త్ ఇండియాలో ఓన్ రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగులో రాష్ట్రాల్లో 'యానిమల్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత 'దిల్' రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రూ. 15 కోట్లకు ఆయన సినిమా తీసుకున్నారట.


Also Read: తెలంగాణ ఎన్నికల్లో ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?


నైజాం, ఉత్తరాంధ్ర మినహా మిగతా ఏరియా పంపిణీ హక్కులను రూ. 6 కోట్లకు 'దిల్' రాజు వేరొకరికి ఇచ్చారని తెలిసింది. నైజాంలో ఆయనకు బలమైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. అందుకని, ఆయన సొంతంగా విడుదల చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి షోస్ వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు విపరీతమైన క్రేజ్ నెలకొంది. అందుకు తగ్గట్టుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. తెలుగులో సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.


Also Readయానిమల్ వయలెన్స్... సలార్ యాక్షన్... డిసెంబర్‌లో ధూమ్ ధామ్ థియేటర్లలోకి భారీ అండ్ క్రేజీ సినిమాలు 



'యానిమల్' సినిమాను భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబర్ 1న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రావడం, సందీప్ రెడ్డి వంగా మీద ప్రశంసలు కురిపించడం సినిమాకు ప్లస్ అని చెప్పాలి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply