Mahesh Babu fans complaint on Naga Vamsi to Animal movie team: 'యానిమల్' సినిమా థియేటర్లలో దుమ్ము రేపుతోంది. వసూళ్ళ జడివాన కురిపిస్తోంది. రణబీర్ కపూర్ నటన, ముఖ్యంగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ జనాలకు విపరీతంగా నచ్చాయి. తెలుగు ప్రేక్షకులు సైతం సినిమాను ఆదరిస్తున్నారు.
ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఓ అడుగు ముందుకు వేసి 'యానిమల్' సినిమాలో క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తే... వాళ్ళపై కాపీరైట్ యాక్ట్ కింద టీ సిరీస్ ప్రొడక్షన్ హౌస్, 'యానిమల్' టీమ్ చర్యలు తీసుకుంది. 'గుంటూరు కారం' నిర్మాత చినబాబు సోదరుని కుమారుడు, సితార ఎంటెర్టైనెంట్స్ నిర్మాత నాగవంశీ మీద చర్యలు తీసుకోవాలని ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కోరుతున్నారు. 'యానిమల్'ను ఆయన పైరసీ చేస్తున్నారని కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఎందుకు? ఏమైంది? వంటి వివరాల్లోకి వెళితే...
'యానిమల్' పైరసీ చేస్తున్న నాగవంశీ!
'యానిమల్' పైరసీ విషయంలోకి వెళ్లే ముందు మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలోని 'ఓ మై బేబీ' సాంగ్ మీద వస్తున్న విమర్శల గురించి చెప్పుకోవాలి. ఆ సాంగ్ విడుదలైన తర్వాత మహేష్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పాట రాసిన రామజోగయ్య శాస్త్రి విమర్శలు చేసిన వాళ్ళను కుక్కలతో పోల్చారు. ఆ తర్వాత ట్విట్టర్ డీయాక్టివేట్ చేశారు. విమర్శలపై నాగవంశీ శుక్రవారం ఉదయం రియాక్ట్ అయ్యారు.
Also Read: ట్రోల్స్‌పై గుంటూరు కారం నిర్మాత ఎటకారం - మహేష్ ఫ్యాన్స్‌ను కోతులతో కంపేర్ చేశారా?
'యానిమల్'లో క్లైమాక్స్ సీన్, రణబీర్ కపూర్ ఓల్డ్ గెటప్ నాగవంశీ పోస్ట్ చేశారు. దానికి ఓ కోట్ యాడ్ చేశారు. ఆయన రియాక్షన్ కొంత మందికి నచ్చలేదు. అది పక్కన పెడితే... 'యానిమల్' ఇంకా థియేటర్లలో ఆడుతుండగా, ఆ సినిమాలో వీడియో పైరసీ క్లిప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో 'తెలుగు నిర్మాత పైరసీ ఎంకరేజ్ చేస్తున్నారు', 'కాపీ రైట్స్ ఉండవా?', 'ఈ అకౌంట్ పైరసీ కంటెంట్ ప్రమోట్ చేస్తుంది. చర్యలు తీసుకోండి' అంటూ మహేష్ బాబు అభిమానులు టీ సిరీస్ ప్రొడక్షన్ హౌస్, 'యానిమల్' సినిమా ట్విట్టర్ అకౌంటులకు కంప్లైంట్స్ చేస్తున్నారు. అదీ సంగతి.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
గమనిక: సోషల్ మీడియాలో కొందరు చేసిన పోస్టులను పాఠకుల దృష్టికి తీసుకు రావడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం! ఇందులో పేర్కొన్న ట్వీట్లకు, ఏబీపీ దేశానికి ఏ విధమైన సంబంధం లేదు. అవి ఏబీపీ దేశం చేసిన ట్వీట్లు కాదు... దయచేసి గమనించగలరు.