అంతర్జాతీయ వేదికపై ఈ ఏడాది క్రీడల్లో భారత పేరు మార్మోగిపోయింది. 2023 ఏడాది భారత క్రికెట్‌కు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. చైనాలో జరిగిన ఆసియా కప్‌లో గతంలో ఎన్నడూ సాధించని పతకాలతో భారత క్రీడాకారులు సత్తా చాటారు. భారత అథ్లెట్ల విజయాలు అంతర్జాతీయ క్రీడా వేదికపై... భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. కొత్త ఏడాదిలోకి మరికొన్ని రోజుల్లో అడుగుపెట్టబోయే సమయంలో క్రీడల్లో గత జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకుందాం.
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా చాటింది. విదేశీ అథ్లెట్లు, ఆటగాళ్లతో పోటీపడి పతకాలు సాధించారు. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో తొలిసారి భారత్ పతకాల సంఖ్య 100 దాటి పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. చైనాలోని హంగ్జౌలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో భారత్ ఏకంగా 107 పతకాలు పతకాలు సాధించగా.. అందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలున్నాయి.
1951లో జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 16 రజతాలు, 20 కాంస్యాల మొత్తం 51 పతకాలతో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. కానీ క్రమంగా భారత్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకానొక స్థితిలో 11 వ స్థానానికి పడిపోయింది. అయితే గత ఆసియా క్రీడల్లో 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలతో మొత్తం 70 పతకాల మార్క్ తొలిసారిగా చేరుకున్న భారత్.. ఈ ఎడిషన్ (2023 )లో మరింతగా దూసుకెళ్లి సెంచరీ చేసింది. తాజాగా చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు సహా మొత్తం 107 పతకాలతో దుమ్మురేపారు భారత ఆటగాళ్లు. 19వ ఆసియా క్రీడల్లో పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో చైనా 383 పతకాలు సాధించింది. రెండో స్థానంలో జపాన్ నిలిచింది. 52 స్వర్ణాలు, 67 రజతాలు, 69 కాంస్యాలతో జపాన్ 188 పతకాలు గెలుచుకుంది. 42 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్య పతకాలతో మొత్తం 190 పతకాలతో దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలిచింది. ఈ ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ 107 పతకాలతో నాలుగో స్థానంలో సాధించింది.
ఆసియా పారా క్రీడల్లో భారత్ 29 బంగారు పతకాలు, 31 రజత, 51 కాంస్య పతకాలతో 111 మెడల్స్‌ను ఖతాలో వేసుకుంది. ఈ మెడల్స్ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. 110కుపైగా పతకాలతో పారా ఆసియా గేమ్స్ పతకాల పట్టికలో నయా భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆసియా పారా గేమ్స్‌లో గతంలో ఎప్పుడూ భారత బృందం 110కుపైగా పతకాలు సాధించలేదు. ఇది భారత క్రీడా చరిత్రలో అద్భుత సమయమని క్రీడా ప్రేమికులు కొనియాడుతున్నారు. ఈ అరుదైన మైలురాయిని చేరుకుని భారత క్రీడా ప్రతిభను అథ్లెట్లు విశ్వవ్యాప్తం చేశారని పొగడ్తలతో ముంచేస్తున్నారు. తొలిసారి 303 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఊహించని రికార్డును బద్దలు కొట్టింది.
భారతదేశం ఈ చారిత్రాత్మక విజయం తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో స్పందించారు. భారత యువతకు సాధ్యం కానిది ఏదీ లేదన్న మోదీ... క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు 100కుపైగా పతకాలా రావడం అనేది మన క్రీడాకారుల ప్రతిభ, కృషి, సంకల్పాల ఫలితం అన్నారు. ఈ అద్భుతమైన మైలురాయి అందరి హృదయాలను అపారమైన గర్వంతో నింపిందంటూ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన అథ్లెట్లు, కోచ్‌లు, వారితో పని చేస్తున్న మొత్తం సహాయక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా పారా క్రీడల్లో చైనా అత్యధికంగా 214 స్వర్ణాలు, 167 వెండి, 140 కాంస్య పతకాలతో మొత్తంగా 521 మెడల్స్‌తో అగ్రస్థానంలో ఉంది. చైనా తర్వాత.. 131 పతకాలతో ఇరాన్ రెండో స్థానం ఆక్రమించింది. తరువాత సౌత్ కొరియా, జపాన్, తరువాత 111 పాతకాలతో 5 వ స్థానంలో ఉంది.