టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతున్న ఈ దర్శకుడు రీసెంట్ గా 'ఎఫ్3' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి యూనిట్ సభ్యులంతా తమవంతు కృషి చేస్తున్నారు. 

 

అయితే హీరోయిన్ తమన్నా మాత్రం ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. దీంతో అసలేం జరిగిందా..? అని ఆరా తీస్తున్నారు. 'ఎఫ్3' షూటింగ్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి.. తమన్నాకు మధ్య గొడవలు జరిగాయని, అందుకే ఆమె ప్రమోషన్స్ లో పాల్గొనలేదని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి ని ప్రశ్నించగా.. ఆయన క్లారిటీ ఇచ్చారు. 

 

తమన్నా జరిగిన గొడవ నిజమేనని.. కానీ అంత పెద్ద గొడవేం కాదని చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది ఆర్టిస్ట్ లతో పనిచేసేప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని అన్నారు. ఓసారి 'ఎఫ్3' షూటింగ్ సమయంలో కొంతమంది ఆర్టిస్ట్ లతో తమన్నా కాంబినేషన్ సీన్స్ చేయాల్సివుంది. దీంతో రాత్రి ఇంకాస్త ఎక్కువసేపు పని చేయాల్సి ఉంటుందని తమన్నాను కోరగా.. ఆమె నేను చేయను, పొద్దున్నే వెళ్లి జిమ్ చేసుకోవాలని చెప్పిందట. 

 

దీంతో ఇద్దరి మధ్య చిన్న కాన్వర్సేషన్ జరిగిందట. ఆ హీట్ రెండు రోజుల పాటు నడిచిందని.. తరువాత మాములుగా మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వలన ఆమె ప్రమోషన్స్ కి రాలేకపోయిందని క్లారిటీ ఇచ్చారు. అలానే 'ఎఫ్4' సినిమా కూడా తీస్తానని.. అందులో హీరోయిన్స్ ను రిపీట్ చేయనని.. కొత్తవారిని తీసుకుంటానని అన్నారు. వెంకీ, వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరో కూడా ఉంటారని చెప్పుకొచ్చారు.