అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్.. బాలీవుడ్ ఆదర్శదంపతులు. వాస్తవానికి రేఖ, అమితాబ్ నడుమ ప్రేమాయణం కొనసాగినా, ఆమెనే తను పెళ్లి చేసుకుంటాడనే ప్రచారం జరిగినా, చివరకు తనను కాదని జయా మెడలో తాళి కట్టాడు అమితాబ్ బచ్చన్. తాజాగా అమితాబ్ తన పెళ్లి రహస్యాన్ని చెప్పారు. కౌన్ బనేగా కరోడ్‌పతి రాబోయే ఎపిసోడ్‌లో.. అమితాబ్, జయా బచ్చన్ ను వివాహం చేసుకోవడానికి అసలు కారణం చెప్పాడు. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ చేసిన తాజా ప్రోమోలో, అమితాబ్ బచ్చన్, షో కంటెస్టెంట్ ప్రియాంక మహర్షి పొడవాటి జుట్టును ప్రశంసించారు. ఇదే సమయంలో జయను పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం చెప్పారు.
జయాను అందుకే పెళ్లి చేసుకున్నా!
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేసిన ప్రోమోలో ఈ ఆసక్తికర విషయం చెప్పారు అమితాబ్. ప్రియాంక తన పొడవాటి జుట్టును ఆమె భుజం ముందు భాగంలో ఉంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఆ తర్వాత అమితాబ్ దృష్టి ఆమె జుట్టుపై పడుతుంది. అప్పుడు తనను ఉద్దేశించి.. తన జుట్టును ఉద్దేశించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మీ జుట్టు చాలా పొడవుగా బాగుందని చెప్పారు. అదే సమయంతో తను జయా బచ్చన్ ను పెళ్లి చేసుకోవడానికి కూడా ఆమె పొడవైన జుట్టే కారణం అని చెప్పాడు. “హమ్నే అప్నీ పత్నీ సే బయా ఏక్ ఇస్స్ వాజా సే కియా థా క్యుకి ఉంకే బాల్ కాఫీ లాంబి ది (ఆమెకు చాలా పొడవాటి జుట్టు ఉంది కాబట్టి నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను)" అన్నారు. దీంతో షోలో పాల్గొన్న వారంతా చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు.
1973లో జయ-అమితాబ్ పెళ్లి!
అమితాబ్, జయా బచ్చన్ మొదటిసారిగా హృషికేశ్ ముఖర్జీ 1971 చిత్రం గుడ్డి షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. ఆ తర్వాత జయ, అమితాబ్ చాలా సినిమాల్లో కలిసి నటించారు. వాటిలో జంజీర్, అభిమాన్, చుప్కే చుప్కే, షోలే, కభీ కహుషి కభీ ఘమ్ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, 1973లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ జన్మించారు. అభిషేక్ వచ్చిన హీరోగా కొనసాగుతుండగా, శ్వేతా బచ్చన్ రచయిత్రిగా కొనసాగుతోంది. వీరికి ముగ్గురు మనుమలు - అగస్త్య నంద, నవ్య నంద, ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. అభిషేక్ బచ్చన్ నటి ఐశ్వర్యారాయ్ ని వివాహం చేసుకున్నాడు. శ్వేత నిఖిల్ నందాను పెళ్లాడింది.
అమితాబ్ నటించిన తాజా సినిమా ‘ఉంఛై’ ఈ మధ్యే థియేటర్లలో విడుదల అయ్యింది. ఇందులో అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, డానీ డెంజోంగ్పా, పరిణీతి చోప్రా, సారిక, నీనా గుప్తా నటించారు. ఈ చిత్రానికి సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించాడు. సూరజ్ తెరకెక్కించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రం తర్వాత ఏడేళ్లకు మళ్లీ ఈ సినిమాను రూపొందించాడు.
Read Also: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యులు కీలక మార్పులు