యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ట్రిపుల్ రోల్ చేసిన సినిమా 'అమిగోస్' (Amigos Telugu Movie). ఇందులో ఆషికా రంగనాథ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో కళ్యాణ్ రామ్ తొలిసారి నటించిన చిత్రమిది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. ఈ నెల 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు కర్నూలులో ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ విషయానికి వస్తే... ముగ్గురిలో ఒకరు ఇండియన్ పాబ్లో ఎస్కోబార్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. అతడిని పోలిన వ్యక్తులు మరో ఇద్దరు ఉంటారు. ఒకరి గాళ్ ఫ్రెండ్ అయితే... ముగ్గుర్ని చూసి కన్‌ఫ్యూజ్ అవుతుంది. ముగ్గురిలో ఒకరు మిగతా ఇద్దరినీ తన ఇంటికి తీసుకు వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? 'రాక్షసుడిని తీసుకొచ్చి ఇంటిలో పెట్టావ్ కదరా!' అని తండ్రి తిడతాడు. ఆ తర్వాత ఏమైంది? తనలా ఉన్న మరో ఇద్దరినీ ఒకరు ఎందుకు చంపాలని అనుకున్నారు? చీకట్లో ఉన్న ఆ డెవిల్ ఎవరు? నేషనల్ సెక్యూరిటీ చీఫ్ బిపిన్ అనే అతడిని చూసి ఎందుకు భయపడుతున్నారు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి.
''నేను ఎవరినీ బెదిరించను. ఐ జస్ట్ కిల్'' అని చివరిలో కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్... ముగ్గురిలో మృగం లాంటి ఒకరి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసింది. ''మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే అరిష్టం'' అనే డైలాగ్ కథలో ఇంకేదో ఉందనే హింట్ ఇస్తోంది. ''సోమాలియా కరువు బాధితుడిలా ఆ ఆకలి చూపులు ఏంట్రా? తినేస్తావా ఆ పిల్లను'' అని బ్రహ్మాజీ అడగటం చూస్తుంటే... కామెడీ, రొమాంటిక్ ట్రాక్ కూడా ఉందని అనిపిస్తోంది.
ఎన్నో రాత్రులు...
రెస్పాన్స్ సూపరు
'అమిగోస్' సినిమాలో రెండు పాటలు విడుదల చేశారు. తొలి పాట 'యెక యెక...'లో ముగ్గురు హీరోల మధ్య ఫ్రెండ్షిప్ ఆవిష్కరించారు. రెండో పాట బాలకృష్ణ 'ధర్మ క్షేత్రం'లో 'ఎన్నో రాత్రులు వస్తాయి...' రీమిక్స్. ఆ వీడియోకి రెస్పాన్స్ బావుంది.
Also Read : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!
'అమిగోస్' నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మేశారని తెలిసింది. వాటితో బడ్జెట్ రికవరీ అయ్యిందని సమాచారం. 'బింబిసార' తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ, శాటిలైట్ ఛానల్స్ 'అమిగోస్'ను తీసుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ హక్కులను తొమ్మిది కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ... భారీ విజయాలు అందుకుంది. అంతే కాదు... ఆ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కూడా లాభాలు అందుకున్నాయి.
Also Read : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు
'అమిగోస్' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల, నృత్యాలు : శోభి, ఫైట్ మాస్టర్స్: వెంకట్, రామ్ కిషన్, పాటలు: 'స్వర్గీయ' శ్రీ వేటూరి, రామజోగయ్య శాస్త్రి, రెహమాన్, ఛాయాగ్రహణం : ఎస్. సౌందర్ రాజన్, సి.ఇ.ఓ : చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : హరి తుమ్మల, సంగీతం : జిబ్రాన్.