తెలుగు ఓటీటీలో మరో టాక్ షో రాబోతోంది. ఇండియన్ పాప్ సింగర్, నటి స్మిత (Pop Singer Smita Talk Show) ఆ టాక్ షోకి హోస్ట్. ఆ ప్రోగ్రామ్ పేరు 'నిజం విత్ స్మిత'. తాజాగా ప్రోమో విడుదల చేశారు. సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్...
'నిజం విత్ స్మిత' ఓపెనింగ్!
ఓటీటీలో టాక్ షో అంటే తెలుగు ప్రజలకు ఇప్పుడు గుర్తుకు వచ్చేది గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ 2' షోనే. ఈ సీజన్ చివరకు వచ్చింది. పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన 'పవర్ ఫైనల్' ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ గురువారం రాత్రి విడుదల అయ్యింది. ఈ నెల (ఫిబ్రవరి) 10న రెండో పార్ట్ స్ట్రీమింగ్ కానుంది. ఆ రోజే 'నిజం విత్ స్మిత' స్టార్ట్ కానుంది.
 
Nijam With Smitha Talk Show : సోనీ లివ్ ఓటీటీలో 'నిజం విత్ స్మిత' టాక్ షో ఫిబ్రవరి 10న మొదలు కానుంది. ఆ విషయాన్ని తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వెల్లడించారు. 


చంద్రబాబు...
చిరంజీవి & మోర్!
'నిజం విత్ స్మిత' షోకి తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథిగా విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా స్మిత షోలో సందడి చేశారు. వాళ్ళిద్దర్నీ ప్రోమోలో చూపించారు. ఇంకా యువ హీరోలు నాని, రానా దగ్గుబాటి, అడివి శేష్, అల్లరి నరేష్, దర్శకులు అనిల్ రావిపూడి, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, దేవా కట్టాతో పాటు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి, సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ సందడి చేశారు. 


కులం...
నేపోటిజం!
'నిజం విత్ స్మిత'లో బోల్డ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి కులం గురించి డిస్కస్ చేసినట్లు మనకు తెలుస్తోంది. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎవరో క్యాస్ట్ గురించి అడిగారని ఈజీగా అర్థం అవుతోంది. 


Also Read : 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?


ఇండస్ట్రీలో ఎటువంటి అండ లేకుండా పైకి వచ్చిన ఈతరం హీరోల్లో ఒకరైన న్యాచురల్ స్టార్ నాని నేపోటిజం గురించి మాట్లాడారు. చరణ్ (మెగా పవర్ స్టార్ రామ్ చరణ్) తొలి సినిమా కోటి మంది చూశారంటే... ఆ కోటి మంది నేపోటిజం ఎంకరేజ్ చేసినట్టు అని నాని తెలిపారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో మహిళలకు ఎక్కువ పవర్స్ ఉండేవని రాధికా అన్నారు. 


గతంలో వచ్చిన టాక్ షోలకు, స్మిత టాక్ షోకు ఏ విధమైన డిఫరెన్స్ ఉంటుందో చూడాలి. సోనీ లివ్ ఓటీటీ ఇతర భాషల్లో సక్సెస్ అయినంతగా, తెలుగులో సక్సెస్ కాలేదు. ఇప్పటి వరకు సరైన బూస్ట్ రాలేదు. మరి, 'నిజం విత్ స్మిత'కు ఏ విధమైన ఆదరణ లభిస్తుందో చూడాలి. సినిమా తారలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా ఈ షోకి తీసుకు వచ్చారు. 


Also Read : 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?