'పోరీల యెంటా పోకు ఫ్రెండు...
ఆడుకుంటారు నిన్నో రౌండు!'
అని అల్లు శిరీష్ (Allu Sirish) పాడుతున్నారు.
'పడిపోకురా ఇస్తే స్మైలు...
బతుకు అయితది గూడ్సు రైలు'
అని అంటున్నారాయన!
అమ్మాయి చేసేదంతా చేసేసి జారుకుంటుందని, దిక్కు మొక్కు లేని అబ్బాయి బారు కాడ ఉంటాడని, అమ్మాయిలంతా మాయని, వాళ్ళతో పెట్టుకుంటే గాయాలు తప్పవని లెక్చర్ ఇస్తున్నారు. చెప్పాలంటే... అల్లు శిరీష్ లెక్చర్ ఇస్తున్నట్లు లేదు. బ్రేకప్ బాధను చెబుతున్నట్టు ఉంది. అది ఏంటో తెలియాలంటే ఈ నెల 17 వరకు వెయిట్ చేయాలి.
Urvasivo Rakshasivo Movie Second Lyrical Mayare Song Promo Out Now : అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఊర్వశివో రాక్షసీవో'. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) హీరోయిన్. థియేటర్లలోకి నవంబర్ 4న ఈ సినిమా రానుంది. ఇందులో తొలి పాట 'ధీంతనాన'ను ఆల్రెడీ విడుదల చేశారు. రెండో పాట 'మాయారే...' ప్రోమో ఈ రోజు విడుదల చేశారు. ఫుల్ లిరికల్ వీడియోను ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
'ఊర్వశివో రాక్షసీవో' చిత్రంలో తొలి పాట 'ధీంతనాన'ను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడగా... పూర్ణాచారి సాహిత్యం అందించారు. అచ్చు రాజమణి సంగీతం అందించారు. ఇప్పుడు విడుదలకు రెడీ అయిన 'మాయారే...' హైదరాబాదీ గాయకుడు, 'బిగ్ బాస్' ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.
Also Read : ఓటీటీలో బాలకృష్ణ సెన్సేషన్ - 24 గంటల్లో వన్ మిలియన్ ప్లస్ బాసూ!
శ్రీ కుమార్ పాత్రలో అల్లు శిరీష్, సింధు పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాలో సునీల్, 'వెన్నెల' కిశోర్, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర తారాగణం. కొత్తగా ఆఫీసులో చేరిన శ్రీకి సింధు పరిచయం అవుతుంది. లిఫ్టులో ముద్దుతో మొదలైన ప్రయాణం... బెడ్ వరకు వస్తుంది. అయితే... సింధుకు శ్రీ ఐ లవ్యూ చెబితే ''అలా చెప్పడం మానేయ్. మనం మంచి స్నేహితులం మాత్రమే అనుకుంటున్నాను'' అని చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది నవంబర్ 4న థియేటర్లలో చూడాలి.
'ఊర్వశివో రాక్షసీవో' చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు కళ్యాణ్ దేవ్ 'విజేత' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రై.లి. పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి విజయ్ ఎం సహ నిర్మాత. తొలుత ఈ చిత్రానికి 'ప్రేమ కాదంట' టైటిల్ ఖరారు చేశారు. 'ఊర్వశివో రాక్షసీవో' అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని, ఈ మధ్య టైటిల్ చేంజ్ చేశారు.
'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' తర్వాత GA2 పిక్చర్స్ సంస్థలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మోడ్రన్ రిలేషన్షిప్స్, లవ్ నేపథ్యంలో సినిమా రూపొందింది.